కార్తీక శుక్రవారం, ప్రబోధిని ఏకాదశి పర్వదినం సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవం 2026 వేడుకల్లో నేడు (నవంబర్ 20, శుక్రవారం) ఏడో రోజు కార్యక్రమాలు వైభవంగా సాగనున్నాయి. ఉడుపి పెజావర్ మఠానికి చెందిన శ్రీ విశ్వప్రసన్నతీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం, ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ మల్లాది సూర్యనారాయణ శర్మ ప్రవచనామృతం భక్తులను ఆకట్టుకోనున్నాయి.
మైసూరు చాముండేశ్వరి, వర్గల్ సరస్వతి, కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవార్లకు త్రిశక్తి మహాపూజ నేటి ప్రధాన ఆకర్షణగా నిలవనుండగా, భక్తులచే సరస్వతి విగ్రహాలకు విశేషార్చన, అలంపురం శ్రీ జోగులాంబ అమ్మవారి కల్యాణం, గజ వాహన సేవ, సప్తహారతులు, సర్వలింగోద్భవం వంటి విశేష ఘట్టాలతో వేడుక కనులపండువగా జరగనుంది. రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆహ్వానం మేరకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దైవానుగ్రహం పొందాలని, ఈ రోజు జరిగే కార్యక్రమాలను కింది ప్రత్యక్ష ప్రసారం లింక్లో వీక్షించండి.

