Site icon NTV Telugu

Koti Deepotsavam 2025 Day 7: అమ్మవార్లకు కోటి కుంకుమార్చన.. జగన్మాతలకు ఒడిబియ్యం సమర్పణ..!

Image

Image

Koti Deepotsavam 2025 Day 7: కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటీ దీపోత్సవం 2025 మహోత్సవం అపారమైన హరిహర నమో శంకర అంటూ దేదివ్యమానంగా కొనసాగుతోంది. 2012లో లక్ష దీపోత్సవంగా ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక యజ్ఞం, ఆపై కోటి దీపోత్సవంగా రూపాంతరం చెంది.. ప్రతి ఏటా భక్తులకు కొత్త ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతోంది. “ప్రతి దీపం ఒక ఆత్మజ్యోతి” అనే పవిత్ర సందేశాన్ని ప్రపంచానికి చాటుతున్న ఈ మహోత్సవం కార్తీకమాస భక్తి వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది.

Nagaram fire accident: విషాదం.. దీపం అంటుకొని చిన్నారి మృతి

ఇక ఈ భక్తి కోటి దీపోత్సవం ఏడవ రోజున (నవంబర్ 7) అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విశేష పూజలతో భక్తి మయంగా సాగనున్నాయి. ముఖ్య అతిథిగా మాతాజీ శ్రీ రమణానంద భారతి స్వామిని (శ్రీ శక్తి పీఠం, తిరుపతి) విచ్చేసి భక్తులకు అనుగ్రహ భాషణం చేయనున్నారు. అలాగే ప్రముఖ ఆధ్యాత్మికతవేత్త డాక్టర్ అనంతలక్ష్మి ప్రధాన వక్తగా పాల్గొని ప్రవచనామృతం ద్వారా ఆధ్యాత్మికతను ప్రసారించనున్నారు. ఈ సందర్భంగా వేదికపై ప్రసిద్ధ క్షేత్రాల అమ్మవార్లకు కోటి కుంకుమార్చన, జగన్మాతలకు ఒడిబియ్యం సమర్పణ కార్యక్రమాలు భక్తిభావంతో నిర్వహించనున్నారు. భక్తులు కూడా దుర్గ విగ్రహాల పూజలో పాల్గొని, కోటి దీపాలు వెలిగించి ఓజస్వీయ సమర్పణతో భక్తిశ్రద్ధలతో పూజలు చేయనున్నారు.

CM Revanth Reddy Birthday: సీఎం రేవంత్ రెడ్డికి వినూత్న రీతిలో బర్త్ డే గిఫ్ట్..!

ఏడవ రోజు ప్రధాన ఆకర్షణగా అలంపురం శ్రీ జోగుళాంబ అమ్మవారి కళ్యాణోత్సవం జరగనుంది. వీటితోపాటు పల్లకీ, గజ వాహనాలతో జరిగే వాహన సేవ భక్తులను ఆకట్టుకునే విధంగా సాగనుంది. ఈ కార్యాక్రమంలో వేలాది మంది భక్తులు ఎన్టీఆర్ స్టేడియంలో దీపాలు వెలిగిస్తూ “ఓం నమః శివాయ” నినాదాలతో మార్మోగించనున్నారు.

Exit mobile version