Site icon NTV Telugu

Koti Deepotsavam 2025 Day 10: అంగరంగ వైభవంగా కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణోత్సవం..

Koti Deepotsavam 2025 Day 10

Koti Deepotsavam 2025 Day 10

Koti Deepotsavam 2025 Day 10: కార్తీకమాసం సందర్భంగా ఎంతో వైభవంగా జరుగుతున్న కోటి దీపోత్సవం 2025 పదవ రోజు కార్యక్రమాలు నవంబర్ 10, సోమవారం (కార్తీక సోమవారం) నాడు అద్భుతంగా నిర్వహించబడ్డాయి. నేడు భక్తి, శ్రద్ధ, ఆధ్యాత్మికతతో నిండిన పూజా కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక లోకంలో ముంచెత్తాయి. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దెత్తున పాల్గొన్నారు. పదవ రోజు కార్యక్రమంలో పూజ్యశ్రీ జయసిద్ధేశ్వర మహాస్వామీజీ (శ్రీశైలం ఆశ్రమం, బెంగళూరు) వారు భక్తులకు ఆధ్యాత్మిక అనుగ్రహ భాషణం అందించనున్నారు. వారి సందేశం భక్తుల మనసులను ప్రసన్నం చేయనుంది. అలాగే బ్రహ్మశ్రీ పఠాన్‌శెట్టి శ్రీనివాస బంగారు శర్మ భక్తులకు జ్ఞానసారాన్ని పంచే ప్రవచనామృతాన్ని అందించారు.

Amit Shah: పట్టణ ప్రాంతాల్లో సహకార బ్యాంకులు.. ‘కో-ఆప్ కుంభ్’ను ప్రారంభించిన అమిత్ షా

ఇక నేటి కార్యక్రమంలో ద్వాదశ జ్యోతిర్లింగ మహాపూజ ఘనంగా నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఉజ్జయిని మహాకాళీదేవికి భస్మహారతి సమర్పణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పూజలతో వేదిక ఆధ్యాత్మిక శోభతో మెరిసిపోయింది. భక్తులు స్వయంగా పాల్గొని శివలింగాలకు కోటి రుద్రాక్షలతో అర్చన చేశారు. ఇక భక్తి శ్రద్ధల నడుమ కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక చివరిలో నంది వాహన సేవ నిర్వహించారు. ఈ దివ్య దర్శనం భక్తులకు పవిత్రతను ప్రసాదించి, ఆధ్యాత్మిక పరిపూర్ణతను అందించించింది.

Delhi Car Blast Live Updates : ఢిల్లీలో ఉగ్రదాడి.? పేలుడు ఘటనలో 13 మంది మృతి..

ఇక నేడు కోటి దీపోత్సవం పదవ రోజు పలువురు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. ఇందులో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. వీరితోపాటు తెలంగాణ, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.

Exit mobile version