కార్తిక మాసం శుభవేళ భక్తి టీవీ ఆధ్వర్యంలో ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. రోజుకో కల్యాణం, వాహనసేవ, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలతో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో దిగ్వజయంగా కొనసాగుతోంది. కోటి దీపోత్సవం వేళ హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. కోటి దీపోత్సవంలో పాల్గొని పునీతులవుతున్నారు.
కోటి దీపోత్సవం 2024లో ఇప్పటికే ఎనమిది రోజులు విజయవంతంగా ముగిసాయి. ఎనమిది రోజుల్లో విశేష కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకోగా.. నేడు 9వ రోజు మరిన్ని కార్యక్రమాలకు భక్తి టీవీ సిద్ధం అవుతోంది. కార్తీక ఆదివారం వేళ ఈరోజు జరిగే విశేష కార్యక్రమాలు ఏంటో చూద్దాం. నేడు శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ అనుగ్రహ భాషణం చేయనున్నారు. బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు ప్రవచనామృతం వినిపించనున్నారు. వేదికపై ప్రసిద్ధక్షేత్రాల అమ్మవార్లకు కోటి కుంకుమార్చన జరగనుంది. భక్తులచే అమ్మవారి విగ్రహాలకు కోటి కుంకుమార్చన చేయిస్తారు. రోజు మాదిరే పల్లకీ వాహన సేవ ఉంటుంది.
తొమ్మిదవ రోజు విశేష కార్యక్రమాలు ఇవే:
# శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ (శ్రీ సీతారామచంద్ర గోపాలకృష్ణ మఠం, ఆదిలాబాద్) గారిచే అనుగ్రహ భాషణం
# బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారిచే ప్రవచనామృతం
# వేదికపై ప్రసిద్ధక్షేత్రాల అమ్మవార్లకు కోటి కుంకుమార్చన, జన్మనక్షత్ర దోషపరిహారానికై నక్షత్ర పూజ
# భక్తులచే అమ్మవారి విగ్రహాలకు కోటి కుంకుమార్చన
# శ్రీ లక్ష్మీనారాయణుల కల్యాణం
# పల్లకీ వాహన సేవ