భక్తి టీవీ ఆధ్వర్యంలో ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. నవంబర్ 9న ఆరంభమైన ఈ దీపాల పండుగ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో దిగ్వజయంగా కొనసాగుతోంది. ఇల కైలాసంలో జరిగే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు ప్రతిరోజు వేలాది సంఖ్యలో తరలివస్తున్నారు. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కోటి దీపోత్సవంలోని కార్యక్రమాలను వీక్షించి.. లోకాన్నే మైమరిచిపోయేలా పునీతులవుతున్నారు.
కోటి దీపోత్సవంలో ఇప్పటికే ఆరు రోజులు విజయవంతంగా ముగిశాయి. నేడు కోటి దీపోత్సవంలో ఏడవ రోజు. కార్తీక పౌర్ణమి వేళ ఈరోజు జరిగే విశేష కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం. నేడు పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ (అవధూత దత్తపీఠం, మైసూరు) అనుగ్రహ భాషణం చేయనున్నారు. మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు గారు ప్రవచనామృతం వినిపించనున్నారు. వేదికపై స్వర్ణలింగానికి రజత బిల్వార్చన, అష్టోత్తరశత స్వర్ణపుష్పార్చన ఉంటుంది. భక్తులచే మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చన చేయిస్తారు. అగ్నిలింగ క్షేత్రం తిరువణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి కల్యాణం జరుగుతుంది. పల్లకీ వాహన సేవ ఉంటుంది.
Also Read: Yamudu : యముడు ఫస్ట్ లుక్ రిలీజ్
ఆరవ రోజు విశేష కార్యక్రమాలు ఇవే:
# పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ (అవధూత దత్తపీఠం, మైసూరు) గారిచే అనుగ్రహ భాషణం
# మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు గారిచే ప్రవచనామృతం
# వేదికపై స్వర్ణలింగానికి రజత బిల్వార్చన, అష్టోత్తరశత స్వర్ణపుష్పార్చన
# భక్తులచే మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చన
# అగ్నిలింగ క్షేత్రం తిరువణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి కల్యాణం
# పల్లకీ వాహన సేవ