Yamudu : యముడు ఫస్ట్ లుక్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరో గా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం “యముడు”. ధర్మో రక్షతి రక్షిత అనే ఉప శీర్షిక తో వస్తున్నా థ్రిల్లర్ చిత్రం షూటింగ్ అంత పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ మాసం లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం లో శ్రావణి శెట్టి హీరోయిన్ గా నటించింది మరియు ఆకాష్ చల్లా రెండో హీరోగా నటించారు. అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈరోజు ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా విడుదల చేశారు. ఫస్ట్ లుక్ విడుదల అనంతరం నిర్మాత రాజ్ కందుకూరి గారు మాట్లాడుతూ “యముడు చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే కథ విన్నాను, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మంచి కథ, ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుంది.
Radhika Kumaraswamy: పెంపుడు కుక్కతో ఒంటరిగా పుట్టినరోజు జరుపుకున్న రాధికా కుమారస్వామి
Also Read
ఈ రోజుల్లో ప్రేక్షకులు చిన్న సినిమా, కొత్త సినిమా అని చూడటం లేదు. కథ బాగుంటే సూపర్ హిట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జగదీష్ ఆమంచి బాగా చేసుంటారు అని నమ్ముతున్నాను. మంచి హిట్ కావాలి” అని కోరుకున్నారు. హీరో, దర్శకుడు నిర్మాత జగదీష్ ఆమంచి మాట్లాడుతూ “మా యముడు చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన నిర్మాత రాజ్ కందుకూరి గారికి ధన్యవాదాలు. మా చిత్ర కథ విషయానికి వస్తే సామాన్య ధర్మం పాటించకుండా సమాజానికి కీడు చేసే వాళ్ళకి యముడు ప్రత్యక్షమై గరుడ పురాణం ప్రకారం శిక్షలు వేస్తుంటాడు. యముడు ఎందుకు ఆలా చేస్తాడు చివరికి ఏమవుతుంది అనేదే చిత్ర కథ. 2005 లో శంకర్ గారి దర్శకత్వం లో హీరో విక్రమ్ గారు నటించిన అపరిచితుడు చిత్రం లగే అదే కాన్సెప్ట్ లో మా చిత్రం కూడా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులందరికీ మా యముడు చిత్రం నచ్చుతుంది” అని తెలిపారు.
తాజావార్తలు
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!