Site icon NTV Telugu

Koti Deepotsavam 2024: ఐదవ రోజు కోటి దీపోత్సవం.. నేటి విశేష కార్యక్రమాలు ఇవే!

Koti Deepotsavam 5th Day

Koti Deepotsavam 5th Day

Koti Deepotsavam 2024: ‘రచన టెలివిజన్‌ లిమిటెడ్‌’ ప్రతీ ఏడాది హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో అంగరంగ వైభవంగా ‘కోటి దీపోత్సవం’ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో జరిగే ఈ దీపాల పండగకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి.. దీపాలను వెలిగిస్తుంటారు. ఈ ఏడాది నవంబర్ 9 నుంచి 25 వరకు కోటి దీపోత్సవం జరగనుంది. కోటి దీపోత్సవం 2024లో ఇప్పటికే నాలుగు రోజులు పూర్తి కాగా.. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం అయితే చాలు దీపాలు, భక్తులతో ఎన్టీఆర్‌ స్టేడియం కన్నుల పండుగగా ఉంటోంది. నేడు కోటి దీపోత్సవంలో ఐదవ రోజు. ఈరోజు జరిగే విశేష కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం.

ఐదవ రోజు విశేష కార్యక్రమాలు ఇవే:
# శ్రీ అద్వైతానంద భారతి స్వామీజీ (శృంగేరి జగద్గురు, అవని) అనుగ్రహ భాషణం చేయనున్నారు
# డా. ఎన్. అనంతలక్ష్మి గారు ప్రవచనామృతం వినిపించనున్నారు
# వేదికపై మల్దకల్ శ్రీ వేంకటేశ్వరస్వామికి కోటి తులసి అర్చన, మహానందికి మహాభిషేకం నిర్వహించనున్నారు
# వేదికపై తులసీ దామోదర కల్యాణం జరగనుంది
# పల్లకీ వాహన సేవ ఉంటుంది

Exit mobile version