రచన టెలివిజన్ లిమిటెడ్ ప్రతీ ఏడాది హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా అంగరంగ వైభవంగా ‘కోటి దీపోత్సవం’ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో జరిగే దీపాల పండగలో లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి దీపాలను వెలిగిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 9 నుంచి 25 వరకు కోటి దీపోత్సవం జరగనుంది. కోటి దీపోత్సవం 2024 మొదటి రోజు శనివారం శంఖారావంతో ప్రారంభమైంది. వేలాది మందితో ఎన్టీఆర్ స్టేడియం కళకళలాడింది.
కోటి దీపోత్సవం 2024లో నేడు రెండో రోజు. నేడు విశేష కార్యక్రమాలు ఉన్నాయి. శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామీజీ (శ్రీ సిద్ధేశ్వరీ పీఠం, కుర్తాళం), రమ్యానంద భారతి మాతాజీ (శ్రీ శక్తిపీఠం, తిరుపతి) గారిచే అనుగ్రహ భాషణం ఉంటుంది. శ్రీ నండూరి శ్రీనివాస్ గారు ప్రవచనామృతం చేయనున్నారు. వేదికపై నర్మదా బాణలింగానికి కోటి భస్మార్చన, భక్తులచే స్వయంగా శివలింగాలకు కోటి భస్మార్చన, కోటి దీపోత్సవం వేదికపై వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కల్యాణం ఉంటుంది. అనంతరం నంది వాహనంపై ఆదిదంపతులు దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం 5.30 నుంచి రెండో రోజు విశేష కార్యక్రమాలు ఆరంభమవుతాయి.