NTV Telugu Site icon

Koti Deepotsavam 2023 9th Day: కోటి దీపోత్సవం తొమ్మిదో రోజు.. ఇల కైలాసంలో నేటి కార్యక్రమాలు ఇవే..

Koti Deepotsavam

Koti Deepotsavam

Koti Deepotsavam 2023 9th Day: దీపయజ్ఞం కోటిదీపోత్సవం కన్నులపండుగా సాగుతోంది.. కోటిదీపోత్సవం వేదకిగా ఎనిమిదో రోజు నాగసాధువులచే మహా రుద్రాభిషేకం, సౌభాగ్యదాయకం.. సర్వమంగళదాయకం భక్తులచే అమ్మలగన్న అమ్మకు కోటిగాజుల అర్చన. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ కల్యాణం. కంచి కామాక్షి దేవి, కొల్హాపూర్‌ మహాలక్ష్మి దర్శన భాగ్యం ఇలా ఇల కైలాసంలో అన్ని కార్యక్రమాలు వైభవంగా సాగాయి.. ఇక, కోటిదీపోత్సవం వేదికగా ఇవాళ తొమ్మిదో రోజు విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నారు..

కోటిదీపోత్సవంలో 9వ రోజు విశేష కార్యక్రమాలు..

* శ్రీ వేంకటేశ్వరస్వామికి మహాభిషేకం

* భక్తులే ఆచరించి తరించేలా అన్నవరం ఆలయ అర్చకులచే శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం

* అన్నవరం శ్రీసత్యదేవుని కల్యాణం

* స్వామి, అమ్మవార్లకు గరుడ సేవ

* కంచి కామాక్షి, కొల్హాపూర్‌ మహాలక్ష్మి దర్శనభాగ్యం

* కేరళకాసరగోడ్‌ యడనీరు మఠం శ్రీసచ్చిదానంద భారతిస్వామి అనుగ్రభాషణం

* బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ ప్రవచనామృతం

* అద్వితీయ భక్తినీరాజనాలు

భక్తి టీవీ కోటిదీపోత్సవ వేదిక ఇలా ఎన్నో విశేష కార్యక్రమాలకు ఈ రోజు వేదిక కాబోతోంది.. ఈ దీపయజ్ఞంలో పాల్గొనే భక్తులకు పూజాసామగ్రి, దీపారాధన వస్తువులను రచనా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉచితంగా అందజేస్తోంది.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కానున్న కోటిదీపోత్సవంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం..