Koti Deepotsavam 2023 12th Day: కార్తిక మాసంలో ప్రతీ ఏటా భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించే కోటి దీపోత్సవం 12వ రోజుకు చేరింది.. మరో రెండు రోజుల్లో ముగియనున్న ఈ దీపయజ్ఞం వేదికగా భక్తులతో కిటకిటలాడుతోంది.. హైదరాబాద్, పరిసర ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తు్నారు.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్.
ఇక, కోటి దీపోత్సవం వేదికగా 12వ రోజు జరిగే విశేష కార్యక్రమాలు ఇవే..
* వైకుంఠ చతుర్ధశి శుభసందర్భంగా కైలాస ప్రాంగణంలో తిరుమల వెంకన్న సాక్షాత్కారం
* అనంతకోటి పుణ్యప్రదం భక్తులచే గోవింద నామస్మరణ
* శ్రీదేవీభూదేవీ సమేత శ్రీనివాస కల్యాణం
* పల్లకీలో ఏడుకొండలస్వామి అనుగ్రహం
* కొల్హాపూర్ మహాలక్ష్మి, కంచికామాక్షి అమ్మవార్ల దర్శనభాగ్యం
* అవధూత దత్తపీఠ ఉత్తరాధిపతి శ్రీ దత్తవిజయానంద తీర్థస్వామి అనుగ్రహ భాషణం
* పుష్పగిరి మహాసంస్థానం శ్రీ విద్యా శంకరభారతి మహాస్వామి ఆశీర్వచనం
* అంబరాన్ని అంటే మహాదేవుని నీరాజనాలు
* కోటి దీపాల వెలుగులు
* సప్తహారతుల కాంతులు
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభంకానున్న కోటిదీపోత్సవం మహాయజ్ఞంలో పాల్గొనాల్సింది సాదరంగా ఆహ్వానం పలుకుతోంది ఎన్టీవీ, భక్తి టీవీ, వనతి టీవీ.. ఈ నెల 14వ తేదీన ప్రారంభం.. ఈ నెల 27వ తేదీతో ముగియనున్న ఈ దీపయజ్ఞంలో పాల్గొనే భక్తులకు పూజాసామగ్రి, దీపారాధన వస్తువులను రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ పూర్తిగా ఉచితంగా అందిస్తోంది..
