Site icon NTV Telugu

Koti Deepotsavam 13th Day: ఇల కైలాసం ఎన్టీఆర్‌ స్టేడియం.. ఘనంగా శ్రీశైల మల్లికార్జున స్వామి కళ్యాణం

Koti Deepotsavam

Koti Deepotsavam

Koti Deepotsavam 13th Day: 13వ రోజు కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇల కైలాసంలో జరిగే అద్భుతమైన కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హైదరాబాద్‌, పరిసర ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. కోటి దీపోత్సవంలో జరిగిన కార్యక్రమాలను వీక్షించి లోకాన్నే మైమరిచిపోయేలా పునీతులయ్యారు. ఇదిలా ఉంటే.. భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది రచనా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. కాగా.. ఈ రోజు జరిగిన విశేష కార్యక్రమాలు ఏం జరిగాయంటే..

Read Also: Koti Deepotsavam 2023 13th Day: ఘనంగా కొనసాగుతున్న కోటి దీపోత్సవం.. నేటి విశేష కార్యక్రమాలు..

కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా కైలాస ప్రాంగణంలో శ్రీశైల మల్లికార్జున స్వామి భక్తులకు సాక్షాత్కరించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నండూరి శ్రీనివాస్‌ భక్తులకు ప్రవచనామృతాన్ని వినిపించారు. వేదికపై ఉజ్జయిని శివలింగానికి కోటి బిల్వార్చన పూజ నిర్వహించారు. అనంతకోటి పుణ్యప్రదం భక్తులచే శివలింగాలకు కోటి బిల్వార్చన పూజ చేయించారు. ప్రత్యేకంగా ఉజ్జయిని భస్మహారతి, జ్వాలాతోరణం కార్యక్రమాలను నిర్వహించారు. తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం జరిపారు. అనంతరం స్వామివారికి నందివాహన సేవ చేపట్టారు. అంబరాన్ని అంటేలా మహాదేవుని నీరాజనాలు చేశారు. ఆ తర్వాత కోటి దీపాల వెలుగులతో స్టేడియం మొత్తం అందంగా జివ్వుజివ్వున మెరిసిపోయింది. కోటిదీపాల వెలుగులు, సప్తహారతుల కాంతులు.. స్వర్ణలింగోద్భవ వైభవాన్ని భక్తులు తిలకించి తరించిపోయారు. మహాదేవునికి మహానీరాజనంతో పాటు అద్భుత సాంస్కృతిక కార్యక్రమాలతో 13వ రోజు కోటి దీపోత్సవ వేడుక విజయవంతంగా ముగిసింది. ఇదిలా ఉండగా రేపు(నవంబర్‌ 27) కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా ప్రధాని మోడీ విచ్చేస్తున్నారు.

Read Also: Koti Deepotsavam 2023 12th Day: భక్తజన సంద్రమైన ఎన్టీఆర్ స్టేడియం.. ఘనంగా శ్రీదేవీభూదేవీ సమేత శ్రీనివాస కల్యాణం

ఇదిలా ఉంటే.. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9.30 వరకు ఎన్టీఆర్ స్టేడియం దీపాల కాంతులతో వెలిగిపోయింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభంకానున్న కోటిదీపోత్సవం మహాయజ్ఞంలో పాల్గొనాల్సింది సాదరంగా ఆహ్వానం పలుకుతోంది ఎన్టీవీ, భక్తి టీవీ, వనతి టీవీ.. ఈ నెల 14వ తేదీన ప్రారంభం.. ఈ నెల 27వ తేదీతో ముగియనున్న ఈ దీపయజ్ఞంలో పాల్గొనే భక్తులకు పూజాసామగ్రి, దీపారాధన వస్తువులను రచన టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పూర్తిగా ఉచితంగా అందిస్తోంది..

 

Exit mobile version