రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. స్థానికేతరులైన చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల అన్నయ్య కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డిలను మన నియోజకవర్గం నుంచి చిత్తుచిత్తుగా ఓడించి తరిమికొట్టాలని బహుజన్ సమాజ్ పార్టీఎమ్మెల్యే అభ్యర్థి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కందుకూరు మండలం కొత్తూర్, మీర్ ఖాన్ పేట, ఆకులమైలారం, భేర్ కంచ, ఎన్టీఆర్ తండా, కొత్తగూడ తదితర గ్రామాల్లో కొత్త మనోహర్ రెడ్డి ప్రచారం చేశారు.
Read Also: Asaduddin Owaisi: కేసీఆర్ మూడో సారి సీఎం అవ్వడం పక్కా.. అసదుద్దీన్ ఓవైసీ
కొత్త మనోహర్ రెడ్డిని గెలిపించేందుకు బీఎస్పీ కార్యకర్తలు, మద్దతుదారులు ఏనుగు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మనోహర్ రెడ్డి వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక మహిళలు ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణ బీఎస్పీ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లలన్నారు. ఇక, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ తండాలో కార్తీక మాసంలో మాలలు ధరించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే శివుడి కృపతో విజయం సాధిస్తానని కొత్త మనోహర్ రెడ్డి అన్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధితో పాటు నిరుపేదలను గుర్తించి 60 గజాల ఇంటి స్థలం కేటాయిస్తానని నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం తనకు ప్రసాదించాలని శివ స్వాములని ఆయన వేడుకున్నారు. స్వామి ఆశీస్సులతో ప్రజలు తనను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని మనోహర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.