Site icon NTV Telugu

MLA Kotamreddy: ప్రేమిస్తే పోయేదేమి లేదు డ్యూడ్.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు! ఎమ్మెల్యే ట్వీట్ వైరల్

Mla Kotamreddy Ys Jagan

Mla Kotamreddy Ys Jagan

MLA Kotamreddy’s Tweet Goes Viral Amid Political Dialogue War: ఇటీవలి రోజుల్లో ‘రప్పా.. రప్పా నరుకుతాం’ అనే డైలాగ్ ఏపీ రాజకీయాల్లో బాగా ఫేమస్ అయింది. ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్‌ పర్యటన సందర్భంగా ‘రప్పా.. రప్పా నరుకుతాం’ అనే పోస్టర్లు కార్యకర్తలు పెట్టడం, వాటిని వైసీపీ అధినేత సమర్ధించడం జరిగింది. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కూడా మరోసారి జగన్‌ స్పందించారు. సినిమాలోని డైలాగునే తమ వాళ్లు పోస్టర్లుగా ప్రదర్శించారని.. ఇదేమైనా తప్పా? అంటూ ప్రశ్నించారు. డైలాగులు నచ్చకపోతే సినిమాలోనూ లేపేయండని, సెన్సార్‌ బోర్డు ద్వారా ఎందుకు అనుమతించారని ఎదురుదాడికి దిగారు. నందమూరి బాలకృష్ణ సినిమాల్లో డైలాగ్‌లు ఇంతకంటే దారుణంగా ఉంటాయని జగన్ వ్యాఖ్యానించారు.

Also Read: Bojjala Sudhir Reddy: దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నా.. వినూత ఘటనలో నా ప్రమేయం లేదు!

మాజీ సీఎం వైఎస్ జగన్‌ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ‘ఎక్స్‌’ వేదికగా స్పందిస్తూ కౌంటర్ వేశారు. ప్రేమిస్తే పోయేదేమి లేదు డ్యూడ్.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అని పేర్కొన్నారు. ‘రప్పా రప్పా నరుకుతాం.. ఏందయ్యా ఇది?. దారి తప్పిన వాళ్ల డైలాగ్. ప్రేమిస్తే పోయేదేమి లేదు డ్యూడ్, మహా అయితే వాళ్లు మనల్ని తిరిగి ప్రేమిస్తారు. ఇది రాష్ట్రాన్ని దారిలో పెట్టి ఆచరించే పార్టీ డైలాగ్. తేడా ఇక్కడే ఉంది సోదరా.. తెలుసుకో’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటంరెడ్డి ట్వీట్ వైరల్ అయింది.

Exit mobile version