Koppula Eshwar Fires On Rahul Gandhi Revanth Reddy: ఖమ్మం సభలో రాహుల్ గాంధీ, అలాగే రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసిన వ్యాఖ్యలపై ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కౌంటర్ ఎటాక్‌కి దిగారు. ఖమ్మంలో జరిగిన సభలో రాహుల్ మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు. పార్టీలో ప్రధాన నాయకుడుగా ఉన్న రాహుల్ గాంధీ మాటలు అవగాహన రాహిత్యంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి రాహుల్ గాంధీ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారు. కేవలం మూడంటే మూడు సంవత్సరాల కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేసి, రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి అందిస్తోందని చెప్పారు. రూ.80 వేల కోట్లకు పైగా ఖర్చుతో సీఎం కేసీఆర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని నిర్మించారని గుర్తు చేశారు.
Professor Fired: క్లాస్‌లోనే బట్టలు విప్పేయమన్నాడు.. ఉద్యోగం పోగొట్టుకున్నాడు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారమని.. ఈ ప్రాజెక్టుతోనే రాష్ట్రం ఇవాళ సస్యశ్యామలం అయ్యిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. నాడు కరువుతో ఉన్న తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్లు ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇవాళ దేశంలోనే అత్యధిక వరి ధాన్యం రాష్ట్రంలో పడుతోందని తెలిపారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందంటే.. సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టే కారణమని అన్నారు. అలాంటి ప్రాజెక్టు గురించి రాహుల్ గాంధీ అడ్డగోలుగా మాట్లాడారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇలా మాట్లాడం విడ్డురంగా ఉందని.. ఇక్కడి నాయకులు రాసిచ్చిన అబద్ధాల స్క్రిప్టుని రాహుల్ గాంధీ చదివారని విమర్శించారు.
Revanth Reddy: బీజేపీ+బీఆర్ఎస్=బై బై.. రేవంత్ రెడ్డి ధ్వజం
ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగురుతాం అన్నట్టు.. రూ.4000 పెన్షన్ ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎంత పెన్షన్ ఇస్తున్నారో ముందుగా చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రూ.2016 పెన్షన్ ఉందని.. వికలాంగులకు రూ.3016 ఇస్తుండగా, దాన్ని రూ.4000 చేస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని గుర్తు చేశారు. పోడు భూముల గురించి కూడా అబద్ధపు మాటలు మాట్లాడారని ధ్వజమెత్తారు. ఇప్పటికే రాష్ట్రంలో పోడు భూముల పంపిణీ జరుగుతోందని, అయినప్పటికీ తాము అధికారంలోకి వస్తే పోడు భూములు పంపిణీ చేస్తామని రాహుల్ గాంధీ చెప్తున్నారన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ ‘బీ-టీమ్’ అంటున్నారని, కానీ ఎవరికి ఎవరు ‘బీ-టీమో’ చెప్పాలని కోరారు.
Lift Harassment: దారుణం.. లిఫ్ట్ పేరుతో బైక్ ఎక్కించుకొని లైంగిక దాడి
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని అరెస్ట్ చేస్తారని చెప్పారని, కానీ ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని మంత్రి ఈశ్వర్ ప్రశ్నించారు. దీన్ని బట్టే ఎవరు ఎవరికి బీ-టీమో అర్థమవుతుందని అన్నారు. హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరు ఎవరికి ‘బి-టీం’గా ఉన్నారో అందరికీ తెలుసన్నారు. మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో.. ఎందుకు ఇక్కడ అమలవుతున్న పథకాలు అక్కడ అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ లో కాంగ్రెస్ మాటలు నమ్మేవారు ఎవరూ లేరన్నారు. తెలంగాణ ప్రజలు చాలా గొప్పవారని, ఎవరు ఏం చేస్తున్నారో వారికి తెలుసని చెప్పారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన భట్టి విక్రమార్కను వేదిక మీదనే తోసేశాడని.. ఇదీ రేవంత్ రెడ్డి సంస్కారమని చురకలంటించారు.