జగిత్యాల జిల్లా ధర్మపురిలో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. నా ఆస్తులు లెక్క పెట్టడానికి గెలిచినవా, ధర్మపురి ప్రజలకు పని చేయడానికి గెలిచినవా ఎమ్మెల్యేగా అడ్లూరి సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. నా జీవితం ఒక తెరిచిన పుస్తకమని ఆయన వ్యాఖ్యానించారు. ధర్మపురి నియోజకవర్గంలోని పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలని, కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరు అయిన అభివృద్ధి పనులను అన్నింటిని రద్దు చేసింది – కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. నీకు ఇన్ని ఆస్తులు ఎక్కడ నుండి వచ్చినాయి, అదే నాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో ముందు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లెక్క చెప్పాలని, ఎన్నికల అప్డేట్ లో నా ఆస్తులు వివరాలు పూర్తి పొందుపరచడం జరిగింది.. ఇంకా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయకండన్నారు. కొప్పుల ఈశ్వర్ ఆస్తుల వివరాలు ప్రజలకు అందరికి తెలుసు అని, నా ఆస్తులు లెక్క పెట్టడానికి గెలిచినవా,ధర్మపురి ప్రజలకు పని చేయడానికి గెలిచినవా ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.