Kondapur Rave Party: కొంపలో కుంపటి.. రేవ్ పార్టీలో 2 కేజీల గంజాయి సీజ్, 9 మంది అరెస్ట్!
- సర్వీస్ అపార్ట్మెంట్‌లో రేవ్ పార్టీ
- కొండాపూర్‌లో 2 కేజీల గంజాయి సీజ్
- రేవ్ పార్టీలో 9 మంది అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kondapur Apartment Rave Party: ఇటీవలి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట ‘రేవ్ పార్టీ’. ఆ మధ్య బెంగళూరులో, ఈ మధ్య సింగర్ సావిత్రి రేవ్ పార్టీలు వార్తల్లో నిలిచాయి. రేవ్ పార్టీలో వంద మందికి పైగా సెలబ్రెటీలు, బడా బాబుల పిల్లలు, రాజకీయ నేతల కుమారులు పట్టుబడుతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. రేవ్ పార్టీలు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ నగరంలో మరో రేవ్ పార్టీ వెలుగు చూసింది. కొండాపూర్‌లో ఏకంగా ఓ సర్వీస్ అపార్ట్మెంట్‌లో రేవ్ పార్టీ జరిగింది. పోలీసుల దాడిలో 2 కేజీల గంజాయి సహా మరిన్ని మత్తు పదార్థాలు సీజ్ అయ్యాయి. ఈ రేవ్ పార్టీలో 9 మందిని అరెస్ట్ చేశారు.
వీకెండ్ వచ్చిందంటే చాలు సర్విస్ అపార్ట్మెంట్‌లో మద్యం విందులు, డ్రగ్స్ వినియోగాలు, అమ్మాయిలు, డాన్సులు.. ఇలా ఇంకెన్నో కొండాపూర్ ఏరియాలో జరుగుతున్న చిత్ర విచిత్రాలు. కొండాపూర్ ఎస్వీ నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్‌లో ఏపీకి చెందిన కొన్ని ముఠాలు రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు. వీకెండ్ సందర్భంగా ఏపీ నుంచి తీసుకువచ్చి ఇక్కడ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. రేవ్ పార్టీని శనివారం రాత్రి నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బిటీం ఎస్సై సంధ్య, ఇతర సిబ్బంది కలిసి దాడి చేశారు. అందరిని శేర్లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు అనే కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా మారు పేరులతో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. నకిలీ బ్యాంక్ అకౌంట్, నకిలీ ఆధార్ కార్డులతో మనుషులను తీసుకువచ్చి రెండు రోజుల పాటు ఎంజాయ్ చేయించి తీసుకు వెళుతుంటారు. ఈ ముఠాను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. రేవ్ పార్టీలో 2.080 కేజీల గంజాయి, 50 ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్ ముష్రూమ్, 1.91 గ్రాముల చరస్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నాలుగు కార్లు, 11 సెల్ ఫోన్లను సీజ్ చేసి.. 9 మందిని అరెస్ట్ చేశారు.
కింగ్ కెన్ షేర్, డ్రగ్స్ సరఫరాదారు రాహుల్, ఆర్గనైజర్ ప్రవీణ్ కుమార్ అలియాస్ మన్నే, అశోక్ కుమార్, ఆర్గనైజర్ సమ్మెల సాయి కృష్ణ, హిట్ జోసఫ్, తోట కుమార స్వామి, అడపా యశ్వంత్ శ్రీ దత్, సమత, తేజలను ఎస్వీ నిలయం సర్వీస్ అపార్ట్మెంట్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో ముగ్గురుపై కూడా కేసు నమోదు చేశారు. వారు పరారీలో ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఈ రేవ్ పార్టీలో ఇంకెవరి హస్తమైనా ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!