NTV Telugu Site icon

Konda Vishweshwar Reddy: ఎన్ని గ్యారెంటీలు ఇచ్చిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మరు

Konda Vishweswar Reddy

Konda Vishweswar Reddy

Konda Vishweshwar Reddy: ఎన్ని గ్యారెంటీలు ఇచ్చిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మరని మాజీ ఎంపీ బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఆర్కేపురం డివిజన్ టీఎన్ఆర్ వద్ద కార్నర్ మీటింగ్ ఆయన మాట్లాడుతూ.. అందెల శ్రీరాములుకు మద్దతుగా ఆర్కేపురంలో ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాగుబోతు ముఖ్యమంత్రి కేసీఆర్ ను తరిమికొట్టాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారిన సబితా ఇంద్రారెడ్డిని మహేశ్వరం ప్రజలు విశ్వసించరన్నారు. బీఆర్ఎస్ పాలనను తరిమికొట్టాలని బీజేపీ పాలను తెలంగాణలో తీసుకురావాలని కోరారు. ధర్మం కోసం దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోనే దేశం రాష్ట్రం అన్ని రంగాలలో అభ్యున్నతి సాధిస్తుందని బీజేపీ మహేశ్వరం అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీజేపీతోనే ఆర్కేపురం డివిజన్ అభివృధ్ది జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఆర్కే పురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి పిట్ట ఉపేందర్ రెడ్డి, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read also: Devi Sri Prasad : ఆ సాంగ్ కేవలం నాలుగున్నర నిముషాల్లోనే చేశాను..

మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్‌ ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోజురోజుకీ ఆయనకు ప్రజల నుంచి, యువత నుంచి అనూహ్యంగా మద్దతు లభిస్తోంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గం కావడంతో.. అందరి చూపు ఆ నియోజకవర్గంపై ఉంది.. ఇక, ఆమెకు ఎదురుగాలి వీస్తున్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి.. ఈ రోజు బీజేపీ కార్యాలయంలో.. అందెల శ్రీరాములు యాదవ్ ని కలిసి మద్దతు ప్రకటించింది నిరుద్యోగ జేఏసీ.. మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులు అంతా బీజేపీకి సపోర్ట్ చేసి.. అందెల శ్రీరాములు యాదవ్ కి గెలిపించుకుంటామని నిరుద్యోగ జేఏసీ నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Pawan Kalyan: తెలంగాణ అంటే నా రోమాలు నిక్క పొడుచుకు వస్తున్నాయ్..