NTV Telugu Site icon

Konda Surekha: సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ

Konda Surekha

Konda Surekha

Konda Surekha: సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. సమంతను ట్యాగ్‌ చేస్తూ మంత్రి కొండా సురేఖ ట్వీట్‌ చేశారు. “నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఓ నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలు దెబ్బతీయాలని కాదు.. స్వయంశక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం.. మీరు మనస్తాపానికి గురైతే నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా.” అంటూ మంత్రి కొండా సురేఖ సమంతను ట్యాగ్‌ చేశారు.

Read Also: Naga Chaitanya : కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగచైతన్య ఏమన్నారంటే..?

మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కొండా సురేఖ మాట్లాడుతూ.. “నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణం. సినిమా పరిశ్రమలో హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవడానికి, ఇండస్ట్రీని వదిలిపెట్టి పోవడానికి ఆయనే కారణం. ఆయన డ్రగ్స్‌కు అలవాటు పడి రేవ్ పార్టీలు చేసుకొన్నారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు. హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేసి వారి లైఫ్‌ను నాశనం చేశారు. అంతే కాకుండా గతంలో అక్రమంగా కట్టిన ఎన్ కన్వెన్షన్‌ను చూసి చూడనట్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేసింది. సమంతను కేటీఆర్ రమ్మని పిలిచాడు. నాగార్జున కుటుంబం కూడా వెళ్లమని ఒత్తిడి చేసింది. అందుకు సమంత ఒప్పుకోకపోవడంతో సమంత విడాకులు తీసుకుంది.” అని కొండా సురేఖ అన్నారు. కేటీఆర్ ను టార్గెట్ చేసుకుని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో భారీ చర్చకు దారితీశాయి.