NTV Telugu Site icon

Konda Surekha : ఎంజిఎంలో రోగులకు మెరుగైన సేవలు అందించాలి

Konda Surekha

Konda Surekha

ఎంజిఎంలో రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు మంత్రి కొండా సురేఖ. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 21 నుండి 170 పరీక్షలు చేయగా 25 పాజిటివ్ రాగా 10 మంది ఎంజిఎం లో చేరి 2 మంది రికవరీ అయ్యారు. 7గురు చికిత్స పొందుతున్నారన్నారు. 1200 ఆక్సిజన్ బెడ్స్ , 3 ఆక్సీజన్ ట్యాంక్స్ సిద్ధంగా ఉన్నాయని, పవర్ కట్ అయినపుడు 5 జనరేటర్ల ద్వారా ఎంజిఎం లో నిరంతరాయ విద్యుత్తు సరఫరా అందించాలన్నారు. ఎంజీఎం లో ఇంకను కావాల్సిన సౌకర్యాలపై త్వరలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో సమావేశం నిర్వహిస్తామన్నారు.

ఇదిలా ఉంటే.. హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర సమీక్ష సమావేశంలో మంత్రివర్యులు కొండ సురేఖ తో కలిసి వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. వీరికి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే కే అర్ నాగరాజు బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. మంత్రులుగా సీతక్క సమ్మక్క సారలక్క, కొమురవెల్లి, అయినవోలు జాతరాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయాలకు అద్దం పటేలా జాతర జరగాలన్నారు. జాతర సమయానికి ప్రజలు అన్ని రకాల వసతులు కల్పించాలని, జాతర లో ప్లాస్టిక్ నిషేధిస్తూ సురక్షితంగా నడపాలన్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ సీసీ కెమెరా ఏర్పాటు చేయాలన్నారు. వివిఐపి, విఐపి, దాతలకు ప్రతేక ప్రవేశం ఏర్పాటు చేయాలని, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది జాతరలో సమగ్ర పనిచేయాలన్నారు.