Site icon NTV Telugu

Konda Surekha : తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను చిన్నచూపు చూడొద్దు

ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్న చూపు ఉంటుంది కానీ ప్రభుత్వ పాఠశాల నుండి ఎంతో ఎత్తుకు ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారని అన్నారు మంత్రి కొండా సురేఖ. వేసవి సెలవులు ముగియడంతో.. విద్యార్థులు తిరిగి బడి బాట పట్టనున్నారు. అయితే.. ప్రతి సంవత్సరం ప్రభుత్వం పాఠశాలలకు వచ్చే విద్యా్ర్థుల సంఖ్య తగ్గుతోంది. దీనికి కారణం ప్రైవేటు పాఠశాలల్లో భోదించి విద్యావిధానమే కారణం. అయితే.. ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్యా్భోదనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నా ప్రజలు మాత్రం ఆసక్తి చూపడం లేదు. అయితే.. దీనిపై మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలో చదివిస్తే బాగా చదువుతారని ఆలోచనలో ఉన్నారని, తల్లిదండ్రులు లేనిపోని భారాన్ని మీద వేసుకొని అప్పులు చేసి ఆస్తులు అమ్మి చదువుపిస్తున్నారన్నారు. ప్రైవేటు పాఠశాలలో ఎక్కువ ర్యాంకు వచ్చిన విద్యార్థులను మాత్రమే జాయిన్ చేసుకుంటారని, ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారన్నారు.

అంతేకాకుండా..’ప్రభుత్వ ఉపాధ్యాయులు పరీక్షలు రాసి అందులో నైపుణ్యం పొందిన వారు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉంటారు… ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల విషయంలో ఎదుర్కొంటున్న అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు… ఏమైనా మిగిలిన వసతులు ఉంటే అతి తొందరలోనే వసతులు కల్పిస్తాం… అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా విద్యార్థులకు దుస్తులు కుట్టేందుకు మహిళలను అందుబాటులోకి తీసుకు వచ్చాము… మునుముందు మహిళా సంఘాలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తాం… రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగ్గా తయారు చేస్తాం…’ అని కొండా సురేఖ అన్నారు.

Exit mobile version