NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy : నల్గొండ ప్రజల దశాబ్దాల కల SLBC

Komatireddy Venkatreddy

Komatireddy Venkatreddy

Komatireddy Venkat Reddy : నల్గొండ పార్లమెంట్ పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్ట్ లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ.. SLBC ప్రాజెక్ట్ 4 లక్షల ఎకరాలకు నీళ్లిచే ప్రాజెక్ట్ అని, SLBC, బ్రాహ్మణవెళ్ళాంల నాకు ప్రథమ ప్రాధాన్యమన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే కాంట్రాక్టర్లు పనిచేయరని, ⁠కాంట్రాక్టర్ పని చేయకపోతే మంత్రి గారికి చెప్పాలన్నారు మంత్రి కోమటిరెడ్డి. నల్గొండ ప్రజల దశబ్దాల కల SLBC అని ఆయన వ్యాఖ్యానించారు. దయచేసి అధికారులు కంటితుడుపు పనులు చేసే ప్రయత్నం చేయకండని ఆయన సూచించారు. సీరియస్ గా పని చేస్తే అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేయొచ్చన్నారు. SLBC ఒక వరల్డ్ వండర్.. SLBC పూర్తయితే.. ప్రపంచమంతా వచ్చి చూస్తుందని, చాలా భాద్యత తో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Healthy Resolution: కొత్త ఏడాదిలో ఆరోగ్యం కోసం ఈ రిజల్యూషన్ తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి

మా బ్రదర్ 26 బోర్లు వేసినా నీళ్లు రాలేక పంట వదిలేశారు.. నల్గొండ అంత విపత్కర పరిస్థితిలో ఉందని, SLBC గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు, డిప్యుటీ సీఎం గారు అందరూ సపోర్ట్ చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అమెరికా ఇంజనీర్లతో కలిసి పనుల్ని వేగవంతం చేయండని, ప్రాజెక్ట్ కోసం ఏం కావాలన్నా చేసే మంత్రిగా నేనున్నానన్నారు. చిన్న చిన్న సమస్యలతో పనులు ఆపడంపై సీరియస్ అయిన మంత్రి కోమటిరెడ్డి.. ఎంత ఆలస్యం అయితే అంత ఖర్చులు పెరుగుతాయన్నారు. అమెరికన్ ఇంజినీర్లు ఆనాడు మిషన్ అమర్చిన రోజు 3 మూడు రోజులు ప్రాజెక్ట్ దగ్గరే ఉన్నానని, SLBC పూర్తి అయితే, ఫర్ షోర్ నుంచి. నీళ్లు తీస్కోవచ్చన్నారు.

Rewind 2024 : విలేజ్ బ్యాక్ డ్రాప్‌ లో వచ్చి హిట్ కొట్టిన సినిమాలు ఇవే

Show comments