NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy : రెండు లక్షల రుణమాఫీ గతంలో ఎవరు చేయలేదు..

Komati Reddy Venkat Reddy

Komati Reddy Venkat Reddy

నల్లగొండ జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజర్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ నిర్ణయం తీసుకున్న సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. రెండు లక్షల రుణమాఫీ గతంలో ఎవరు చేయలేదని, గత ప్రభుత్వాలు చేసిన రుణమాఫీ వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. రెండు లక్షల రుణమాఫీ దేశంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు.

రైతులకు సంబంధించిన ఏ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రాజీపడదని, రైతు భరోసా ఏ విధంగా చేయానే దానిపై ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. రెండు లక్షల రుణమాఫీ అందుకుంటున్న రైతులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి. అంతేకాకుండా.. జిల్లాలో ఏ గ్రామంలో కూడా మిషన్ భగీరథ పథకం అందడం లేదని, ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులతో సమీక్ష నిర్వహించి పూర్తిస్థాయిలో తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.