Site icon NTV Telugu

Komatireddy Venkat Reddy : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి తెలంగాణ తరపున కృతజ్ఞతలు

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి తెలంగాణ తరపున కృతజ్ఞతలు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అంశాలపై రెండు గంటలు రివ్యూ చేశారన్నారు. పదేళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ తో అభివృద్ధి ఆగిపోయిందని, ఎన్నో పనులు మొదలు అయి ఆగిపోయాయన్నారు. RRR అనౌన్స్ చేసినా ఒక్క అడుగు పడలేదన్నారు వెంకట్ రెడ్డి. హైదరాబాద్ విజయవాడ హైవే కు సంబంధించి ఎంపిగా ఉండి కూడా అడిగానని, ఫిబ్రవరి చివరి నాటికి వరకు పరిష్కరిస్తా అన్నారని ఆయన పేర్కొన్నారు.

 

అంతేకాకుండా.. Rob ల వద్ద పనుల కోసం 300 కోట్లు విడుదల చేస్తున్నాం అన్నారని, ఈ అన్వల్ ప్లాన్ లో నల్లగొండ బై పాస్ కు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఉప్పల్.. ఘట్కేసర్ గత రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్ల పనులు జరగలేదని, RRR కు ఫాస్ట్రాక్ లో టెండర్లు పిలవమని చెప్పారన్నారు. తెలంగాణ కు సహకరిస్తామని గడ్కరీ చెప్పారని, అన్ని రోడ్లను హైవెలుగా మారుస్తాం అని గడ్కరీ చెప్పారన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఫిబ్రవరి 11 కు తెలంగాణ కు రావాలని కోరామని, కేసీఅర్, కేటీఆర్ లు ఏం మాట్లాడినా మేం పట్టించుకోమన్నారు అన్ని జిల్లాల్లో స్కిల్ డ్రైవింగ్ సెంటర్లు పెట్టాలని కోరామని ఆయన తెలిపారు.

 

Exit mobile version