NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: నేనెప్పుడూ రానని చెప్పలేదే.. ఫోన్ చేస్తేనే వచ్చాను

Komati Reddy

Komati Reddy

Komatireddy Venkat Reddy:సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీ భవన్‌కు వచ్చారు. ఇన్ని రోజులు గాంధీభవన్‌లో అడుగుపెట్టని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఏడాదిన్నర తర్వాత ఈరోజు గాంధీభవన్‌కు వెళ్లారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ ఠాక్రేతో కోమటిరెడ్డి భేటీ కానున్నారు. గాంధీభవన్ మెట్లు ఎక్కబోనని తానెప్పుడూ అనలేదని, మీటింగ్‌కు రావాలని ఠాక్రే ఆహ్వానించారని తెలిపారు. ఎలక్షన్ కమిటీ మీటింగ్‌లో పాల్గొనడానికి వచ్చానని పేర్కొన్నారు. తాను ప్రతిరోజు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని వెంకటరెడ్డి తెలిపారు.

Read Also: Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో విబేధాలు.. అలిగి వెళ్లిపోయిన వీహెచ్

కొత్త ఇంఛార్జ్ ఆహ్వానం మేరకు గాంధీ భవన్‌కు వచ్చానన్నారు. తనకు గాంధీ భవన్‌తో 30 ఏండ్ల అనుబంధం వుందన్నారు. 26 నుంచి జరిగే పార్టీ కార్యక్రమాల్లో తాను పాల్గొంటానని చెప్పారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి ఎలా తీసుకు రావాలనే అంశంపై చర్చిస్తామన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి కి మద్దతు ఇవ్వాలంటూ ఓ కాంగ్రెస్‌ నాయకుడికి వెంకట్‌రెడ్డి ఫోన్‌ చేసిన ఆడియో అప్పట్లో బయటికి వచ్చింది. తన సోదరుడి కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరోక్షంగా సహకరించారని, కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతిని పట్టించుకోలేదని, హస్తం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి కూడా వెంకట్ రెడ్డి దూరంగా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి.

Read Also: BJP Leader Laxman : 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మిషన్ 405తో ముందుకు వెళ్లాలి

ఈ సందర్బంగా కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ.. నేనెప్పుడూ గాంధీభవన్‌కు రానని చెప్పలేదు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే ఫోన్‌ చేశారు అందుకే వచ్చాను. జనవరి 26 నుంచి జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాను. అధికారంలోకి ఎలా రావాలి? అనే అంశంపై చర్చిస్తాము. అవసరమైతే తెలంగాణవ్యాప్తంగా పాదయాత్ర చేస్తాను అని అన్నారు. అనంతరం.. గాంధీభవనల్‌ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డితో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. అనంతరం, ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రేతో కూడా కోమటిరెడ్డి భేటీ అయ్యారు. దీంతో, వారి మధ్య చర్చపై ఆసక్తి నెలకొంది.

Show comments