తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతుండగా.. వచ్చే నెల 3న పోలింగ్, 6న ఓట్ల లెక్కింపు జరుగనుంది. అయితే.. ఇదిలా ఉంటే.. మునుగోడు ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ ప్రచారాల్లో హామీలు కురిపిస్తున్నారు. అయితే.. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ కోమటిరెడ్డి బ్రదర్స్‌ను కోవర్ట్‌రెడ్డి బ్రదర్స్ అని వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఘాటుగా స్పందించారు.
తెలంగాణ కోసం మంత్రి పదవి వదులుకున్న నన్ను కోవర్ట్ అనే అర్హత కేటీఆర్‌కు ఉందా అని ఆయన ప్రశ్నించారు. నాపై కేటీఆర్ చేసిన కోవర్ట్ కామెంట్స్ విత్ డ్రా చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విదేశీ పర్యటన తన వ్యక్తిగత మన్న వెంకట్‌రెడ్డి.. సొంత పార్టీ నేతలు తిట్టిన బాధలోనే నేను ప్రచారానికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. కేటీఆర్ వంద దేశాలు తిరిగి ఏం చేశారో నాకు తెలుసు అని, నేనే ప్రచారానికి వెళ్లినా, వెళ్లకపోయినా వాళ్లకు ఎందుకుని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నుంచి ఒక్క ఎంపీ కూడా పార్టీ మారరని ఆయన వెల్లడించారు.
