నల్గొండ జిల్లాలోని 12 స్థానాల్లో హస్తందే గెలుపు అని ధీమా వ్యక్తి చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాయకులకు కోసం కాకుండా 4 కోట్ల మంది ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఉందని, నల్గొండ జిల్లాలోని 12 స్థానాల్లో హస్తందే గెలుపు అన్నారు. భువనగిరిలో 40 ఏళ్ల చరిత్ర తిరగరాయాలన్నారు. ఎంత కష్టపడాలన్న 33 రోజులు మాత్రమే ఉందని, పోలింగ్ వరకు ప్రతి గ్రామంలో ప్రచారం చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఒక్కసారి కాంగ్రెస్ కు ఓటు వేయ్యండి తర్వాత ఐదేళ్లు మీ కోసం మేమం కష్టపడతామని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. నాకు 27 ఏళ్ల అనుభవంతో చెబుతున్న కాంగ్రెస్ గెలుపు మీ బాధ్యత అని, అనిల్ రెడ్డి ఈ సారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతున్నానన్నారు కోమటిరెడ్డి. తెలంగాణ ఇచ్చిందని ఆనాడు కాళ్లు మొక్కిన కేసీఆర్ ఈనాడు కాంగ్రెస్ గ్యారెంటీ లేని పార్టీ అంటున్నాడని, తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని వదులుకున్నానని ఆయన వెల్లడించారు.
Also Read : Marsukola Saraswathi: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో టికెట్ చిచ్చు.. అమ్ముకున్నారని సరస్వతి తీవ్ర ఆరోపణలు
అంతేకాకుండా.. ’11 రోజులు గడియారం సెంటర్ చిత్తుశుద్దితో అమరణ నిరాహార దీక్షచేశాను.. కేసీఆర్ లాగా గ్లూకోజ్ తీసుకుంటూ ధీక్ష చేయ్యలేదు.. హారీష్ రావులా పెట్రోల్ పోసుకోని బెదిరించలేదు.. మీ అందరికి చేతులెత్తు మొక్కుతున్న మనస్పర్ధాలను పక్కన పెట్టి అనిల్ రెడ్డి ని గెలిపించండి.. మేము ఎమ్మెల్యేలుగా గెలివాలనుకుంటుంది ప్రజా సేవకోసమే.. పదేళ్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పనితీరు చూశారు.. ఈ సారి కాంగ్రెస్ ను గెలిపించి చూడండి.. కేసీఆర్ బంధువులు కూడా బీఆర్ఎస్ ను నమ్మకుండా కాంగ్రెస్ లో చేరారు.. కాంగ్రెస్ హయంలో కట్టిన ఏ ప్రాజెక్ట్ కు కూడా చిన్న గీత పడలేదు..’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read : Marsukola Saraswathi: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో టికెట్ చిచ్చు.. అమ్ముకున్నారని సరస్వతి తీవ్ర ఆరోపణలు
