NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy : ఆదిభట్లలో రతన్ టాటా విగ్రహం పెడతాం

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్లలో 25 కోట్ల రూపాయలతో ఆదిభట్ల నుంచి మంగళ్ పల్లి రోడ్డుకు శంకుస్థాపన చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అనంతరం బహిరంగసభలో పాల్కొని ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన నుంచి వచ్చాక చర్చించి రతన్ టాటా విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. దేశంలో తన సంపదలో సగానికిపైగా ప్రజల కోసం పంచిన దానశీలురు రతన్ టాటా. వారి కంపెనీలు ఈ ప్రాంతంలో వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నాయన్నారు. టాటా కంపెనీ సీఎస్ఆర్ ఫండ్స్ తో ఐటీఐలను అప్ గ్రేడ్ చేస్తున్నాం. స్కిల్ సెంటర్స్ ను డెవలప్ చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి. వారి సేవాతత్పరథకు గుర్తుగా వారిని గౌరవించుకుంటూ ఆదిభట్లలో అద్భుతమైన రతన్ టాటా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రంలో ఎన్.హెచ్-65 విస్తరణ, ఆర్ఆర్ఆర్, ఇతర జాతీయ, రాష్ట్ర రాహదారులు మౌళిక వసతుల కల్పనలో కీలకపాత్ర పోషించబోతున్నాయని ఆయన తెలిపారు. గ్రామసభల్లోనే ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా, రేషన్ కార్డులకు అర్హులను ఎంపిక చేస్తున్నామని, ఆనాడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లకు ఇచ్చినం.. ఇవ్వాల అది 10 లక్షలతో సమానమన్నారు మంత్రి కోమటిరెడ్డి.

Maha Kumbh Mela 2025: రికార్డ్ స్థాయిలో భక్తులు.. 10 కోట్ల మంది స్నానాలు

అంతేకాకుండా..’ఆనాడు ఇళ్లు కావాలా అని అడిగితే ఒక్కరు చేయి ఎత్తనంత స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి పేదలకు ఇచ్చినం. రేపు 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. మా సంక్షేమ కార్యక్రమాలు చూసి కేటీఆర్, హరీష్ రావుకు మైండ్ బ్లాంక్ అయ్యింది. ఈ సంక్షేమం వల్ల బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మరిచిపోతరని పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారు. మేం విమర్శలను పట్టించుకోం, న్యాయమైన సలహా ఎవ్వరు ఇచ్చినా స్వీకరిస్తాం. గ్రామసభలు ఈ వారం రోజులతో అయిపోయేది కాదు, నిరంతర ప్రక్రియ, ఇవ్వాల సభ అయిపోతే ఎట్లా అనే ఆందోళన అవసరం లేదు. రేషన్ కార్డులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేలా ఏర్పాటు. మాది మానవీయమైన సర్కారు. ప్రతీపేదకు సన్నబియ్యం ఇస్తాం. ఫార్మాసిటీ వద్దని ఆనాడే పోరాడాం. 14 వేల ఎకరాల్లో ఫార్మసిటీ వస్తే కాలనీ కాలనీలు లేచిపోవాల్సి వస్తుంది. ఒక్క పరిశ్రమతో ఎల్ బీ నగర్ ఇవ్వాల చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్లది ప్రజల్ని చంపే ఫార్మాసిటీ విధానం, మాది యువతకు ఉద్యోగాలు కల్పించే స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, డాటాసెంటర్ వంటి భవిష్యత్ డెవలప్ మెంట్ యాక్టివిటీస్ మీద పనిచేస్తున్నాం. అందుకే వేల కోట్ల రూపాయల కంపెనీలు హైదరాబాద్ కు వస్తున్నయి. ఇప్పటికే దాదాపు లక్ష కోట్ల రూపాలయ పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వంతో వివిధ కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి.

ఇక్కడి ప్రజల్ని ఇబ్బందిపెట్టేందుకు.. అప్పటి ఎమ్మెల్యే అసైన్డ్ భూములు కొని ఫార్మాసిటీకి ఇచ్చిండు. ఫార్మాసిటీ అనేది ప్రజలు లేని రిమోట్ ప్రాంతాల్లో ఉండాలని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వచ్చిన మూడు రోజులకే నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్ నలుదిక్కులా అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం వ్యూహాత్మకంగా, ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతుంది. అందుకే శామీర్ పేట వరకు మెట్రో విస్తరణకు మంజూరీ ఇచ్చాం. ఆనాడు ఎంపీగా, ప్రతిపక్ష పార్టీలో ఉండే అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేశాం. ఇప్పుడు అధికారంలో ఉన్నాం. నేను ఎమ్మెల్యే కలిసి ఇబ్రహీం పట్నం ను అద్భుతంగా అభివృద్ధి చేస్తాం.’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. ఆదిభట్ల మున్సిపల్ ఛైర్మన్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Minister Lokesh: క్యాన్సర్ చికిత్సలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రితో కలిసి పనిచేయండి..