Komatireddy Venkat reddy: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని గాంధీ పార్కులో గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాళులర్పించారు. గాంధీ ఆశయాల కోసం కృషి చేద్దామని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో 30 మంది వీఆర్ఏలు ఆత్మహత్య చేసుకున్నారు, పదివేల మంది ఉన్న వీఆర్ఏ సమస్యలను పరిష్కరించ లేకపోయారు.. 100 కోట్లు పెట్టుకొని సొంతంగా ఫ్లైట్ కొనుక్కోవచ్చు కానీ వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించలేరా అంటూ ఆయన ప్రశ్నించారు. రెండు రోజుల్లో వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వరంగల్ పర్యటనలో భాగంగా వీఆర్ఏలు తమ సమస్యలు పరిష్కరించాలని మీ దగ్గరికి వస్తే ఎలా ప్రవర్తించారో అందరూ చూశారన్నారు. వరంగల్ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
Revanth Reddy: యుగపురుషుడిగా గాంధీజీ మనకు గర్వకారణం
ఓ వీఆర్ఏ గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించని వాళ్లు.. దేశం కోసం పార్టీ పెట్టి ఏం చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ మొత్తం బంగారం అయిందని.. ఈరోజు భారతదేశాన్ని బాగు చేస్తానని బయలుదేరుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఉన్న సమస్యలను డైవర్ట్ చేయడానికి, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తప్పించుకోవడానికి ఇలా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని.. శ్రీకాంతాచారి లాంటి వాళ్లు ఈ గడ్డ కోసం అమరులైనందుకు చాలా బాధ అనిపిస్తుందన్నారు.