Suriya: కోలీవుడ్‌పై కన్నేసిన మహేష్ బాబు డైరెక్టర్.. తమిళ టాప్ హీరోతో సినిమా!

Karthi In Suriya Kanguva

Karthi In Suriya Kanguva

Suriya: సినిమా ఇండస్ట్రీలో ఒక మాట తరచూ వినిపిస్తుంటుంది. ఒక్క విజయం ఓవర్‌నైట్ స్టార్‌ని చేస్తే, ఒక్క అపజయం తదుపరి ప్రాజెక్టు పట్టాలెక్కకుండా ముచ్చెమటలు పట్టిస్తుంది. ఈ మాట అందరి విషయంలో అక్షరాల పని చేస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలతో పని చేసిన డైరెక్టర్ పరుశురాం తన లాస్ట్ సినిమా రిజల్ట్‌తో కొత్త సినిమా పట్టాలెక్కించడానికి చాలా సమయం తీసుకుంటున్నారు. డైరెక్టర్ పరుశురాం తన లాస్ట్ సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ను రౌడీ హీరో విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి, మిక్సీ్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా రిజల్ట్‌తో పరుశురాం తన నెక్ట్స్ సినిమాకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

READ ALSO: Vaibhav Sooryavanshi Century: వరల్డ్‌కప్ ఫైనల్లో సెంచరీలు.. చరిత్రలో నిలిచిపోయిన ఇన్నింగ్స్‌లు ఇవే!

తాజాగా ఈ డైరెక్టర్ కోలీవుడ్‌పై కన్నేసినట్లు టాక్ నడుస్తుంది. తన నెక్ట్స్ సినిమాను తమిళ టాప్ హీరోతో చేసే ఛాన్స్ ఉందని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే డైరెక్టర్ పరుశురాం తన తదుపరి చిత్రాన్ని తమిళ స్టార్ హీరో సూర్యతో చేయడానికి సిద్ధం అవుతున్నట్లు టాలీవుడ్ సర్కిల్‌లో ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తారని టాక్. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. అతి త్వరలో ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.

READ ALSO: Bhumika : రాత్రంతా నిద్రపోలేదు..స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న భూమిక..