Hero Ajith : కోలీవుడ్ స్టార్ హీరో తళా అజిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అతడి కార్ రేస్ సాహసాల గురించి అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. దుబాయ్ ఈవెంట్ లో ఆయన గెలవడానికి చాలా కష్టపడ్డాడు. అజిత్ రేసర్ల గ్రూప్ నాయకుడు కావడంతో ఈ రేస్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ప్రీప్రాక్టీస్ సెషన్స్ లో చాలా రిస్క్ చేశాడు. తన కార్ రేస్ ట్రాక్ లో ప్రమాదానికి గురి కావడంతో అభిమానుల్లో ఆందోళన తీవ్రమైంది. కానీ అన్నిటినీ ఇప్పుడు అజిత్ మరిపించేశాడు. తనకి రేసింగ్ అంటే విపరీతమైన ఇష్టం. ఆ ఇష్టం కారణంగానే ఎంత రిస్క్ అయినా తీసుకునే నైజం అతడిది. అజిత్ కి బైక్ రేసింగ్ అంటే ఎంత ఇష్టం అనేది తన సినిమాల్లో చేసే రియల్ స్టంట్స్ చూస్తేనే అర్ధం అయ్యిపోతుంది.
Read Also:Manda Jagannatham : మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతి… సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
అయితే తాను ఒక్క బైక్ రేసర్ గానే కాకుండా కార్ రేసింగ్ లో కూడా ఇపుడు సత్తా చాటారు. జనవరి 12న దుబాయ్ 24H రేసింగ్ ఈవెంట్‌లో అజిత్ కుమార్ అజేయంగా మూడవ స్థానంలో నిలిచాడు. ఈ విజయానికి అతడి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రేస్ ముగిశాక విజయం ఖరారయ్యాక.. పిట్ లేన్ వద్ద ఉన్న తన భార్య షాలినిని తళా ముద్దు పెట్టుకున్నారు. రేసింగ్ ఆద్యంతం షాలిని తనను ఉత్సాహపరిచింది. ఆ అరుదైన క్షణానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా షేర్ అవుతోంది. తన గారాల కూతురుకు పెక్ ఇచ్చాడు. మరొక వీడియోలో తళా భారతీయ జెండాను పట్టుకుని పిట్ లేన్ వద్ద ఆనందంగా పరిగెత్తుతూ కనిపించాడు.
Read Also:Urban Terrain Bolt Cycle: ఆఫర్ ఆదిరింది.. రూ. 20 వేలు విలువ చేసే సైకిల్ రూ. 6 వేలకే!
ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది పేరు మోసిన రేసర్లు పాల్గొన్న ఈ 24 హవర్స్ రేసింగ్ ట్రాక్ లో అజిత్ మూడో స్థానంలో నిలిచి అదరగొట్టారు. దీనితో తన విజయాన్ని అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటుండగా మొత్తం ఇండియా వైడ్ గా ప్రముఖులు తనకి అభినందనలు తెలుపుతు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి అద్భుతమైన ప్రదర్శన వీక్షించిన ఆర్ మాధవన్, శివకార్తికేయన్, దర్శకుడు అధిక్ రవిచంద్రన్ వంటి ప్రముఖులు తమ గర్వాన్ని వ్యక్తం చేశారు.