NTV Telugu Site icon

Loksabha Election 2024: ఎన్నికల ప్రచారంలో గుండెపోటు.. ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు!

Mansoor Ali Khan

Mansoor Ali Khan

Kollywood Actor Mansoor Ali Khan Hospitalized: కోలీవుడ్‌ నటుడు, రాజకీయ నాయకుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ ఆస్పత్రిలో చేరారు. వేలూరులో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనకు ఒక్కసారిగా ఛాతీ నొప్పి రావడంతో స్పృహతప్పి పడిపోయారు. పక్కనే ఉన్న వాలంటీర్లు మన్సూర్‌ను కేకే నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. మన్సూర్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలియాల్సి ఉంది.

వేలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి మన్సూర్ అలీ ఖాన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పనసపండు గుర్తు ఆయనకు దక్కగా.. వేలూరులో ఎన్నికల ప్రచారం ఆరంభించారు. ‘డెమోక్రటిక్ టైగర్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో పార్టీని ఆయన ప్రారంభించారు. అయితే తన పార్టీకి ఇంకా ఎన్నికల సంఘం గుర్తింపు రాకపోవడంతో.. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఉండగానే ఆయనకు ఛాతిలో స్వల్ప అసౌకర్యం కలిగింది.

Also Read: Samsung AI TV 2024: ఏఐ ఫీచర్లతో శాంసంగ్‌ స్మార్ట్‌టీవీలు.. ధర తెలిస్తే మైండ్ బ్లాకే!

పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మన్సూర్ అలీ ఖాన్.. వాటిన లెక్కచేయకుండా ప్రజల సమస్యలపై గళం విప్పుతున్నారు. సినిమాలకు కాస్త విరామం ఇచ్చి మరి తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఇక ఇటీవల హీరోయిన్ త్రిషపై మన్సూర్ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. లియో మూవీలో త్రిష, మన్సూర్ నటించారు. త్రిషతో రేప్ సీన్ ఉంటుందని, ఆమెను బెడ్ రూంలోకి తీసుకెళ్లే ఛాన్స్ వస్తుందని తాను ఆశపడ్డానని మన్సూర్ అన్నారు. ఈ వ్యాఖ్యలను కోలీవుడ్, టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు ఖండించారు.