Minister Kollu Ravindra about Free Bus Travel for Women in AP: మహిళల ఆర్టీసీ బస్సు ప్రయాణంకు ఆగష్టు 15న శ్రీకరం చుట్టబోతున్నాం అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. త్వరలో ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని పోర్టు త్వరలోనే పూర్తి కాబోతుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కారణంగా ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఏపీకి రాబోతున్నాయని చెప్పారు. ఉత్తరాంధ్రలో విశాఖపట్నంను ఫైనాన్షియల్ హబ్‌గా చేయడానికి కార్యాచరణ చేస్తున్నాం అని, 20 లక్షల ఉద్యోగాల్లో భాగంగా ప్రణాళికలు తయారు చేస్తున్నాం అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. నేడు శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి పర్యటించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే, కీలక నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘సుపరిపాలన-తొలి అడుగులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల ఇళ్లు పరిశీలించాం. త్వరలోనే అన్నదాత సుఖీభవ అందించబోతున్నాం. విడతల వారీగా రూ.7000 చొప్పున రూ.20 వేలు రైతన్నలకు అందిస్తాం. మహిళల ఆర్టీసీ బస్సు ప్రయాణం ఆగష్టు 15వ తేదీన శ్రీకరం చుట్టబోతున్నాం. త్వరలో ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. గుంతల మయమైన రోడ్లన్నీ సరిచేశాం. ఆంధ్రరాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని పోర్టు త్వరలోనే పూర్తి కాబోతుంది. కార్గో ఎయిర్‌పోర్ట్‌కు కూడా కేంద్రవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక్కడ కొంతమంది నాయకులు రెచ్చగొట్టే కార్యక్రమం చేపడుతున్నారు’ అని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు.
‘రాష్ట్ర అభివృద్ధి జరగడం కొందరికి ఇష్టం లేదు. సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కారణంగా ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఏపీకి రాబోతున్నాయి. దిగ్గజ కంపెనీలు ఆంధ్రరాష్ట్రానికి రావడానికి ముందుకు వస్తుంటే.. వైసీపీ నాయకులు పిచ్చిపిచ్చిగా వాగుతున్నారు. స్టీల్ ప్లాంట్, వెళ్లిపోయిన రైల్వే జోన్‌ను తీసుకొచ్చి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో విశాఖపట్నంను ఫైనాన్షియల్ హబ్‌గా చేయడానికి కార్యాచరణ చేస్తున్నాం. 20 లక్షల ఉద్యోగాల్లో భాగంగా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. వైసీపీ స్కాంలు బయటపడుతున్నాయి. పలాసలో ఉన్న బోడికొండ, నల్లబొడ్లూరు కొండ కొల్లగొట్టిన అంశాలు తమ దృష్టికి వచ్చాయి’ అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
