NTV Telugu Site icon

Kolkata Incident : కోల్‎కతా ట్రైనీ డాక్టర్ పై దారుణం.. ఆగ్రహంతో ఆస్పత్రిని ధ్వంసం చేసిన నిరసనకారులు

New Project (11)

New Project (11)

Kolkata RG Kar Medical College Vandalised : కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఆగస్టు 9న జరిగిన ఈ విషాద ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు, ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా గురువారం అర్ధరాత్రి 12.40 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు పెద్దఎత్తున ఆసుపత్రిలోకి ప్రవేశించి ఆస్పత్రికి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) పగటిపూట ప్రారంభించింది.

Read Also:Off The Record : BRSలో మళ్ళీ వలసల టెన్షన్..కాంగ్రెస్ పెద్దలు ఆగుతారా.? లాగుతారా.?

దాడి చేసిన వారు ఎమర్జెన్సీ వార్డును కూడా వదిలిపెట్టలేదు. అక్కడ ఉంచిన మందులను కూడా ధ్వంసం చేశారు. పలు దిక్కుల నుంచి వచ్చిన జనాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి, టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించినట్లు సమాచారం. పలు పోలీసు వాహనాలు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. ఆస్పత్రికి రక్షణగా ఉన్న పోలీసులను నిరసన కారులు ఇటుకలు, రాళ్లతో కొట్టారని ఒక పోలీసు అధికారి తెలిపారు. తెల్లవారుజామున 4 గంటల వరకు పోలీసులు ఎంత మంది సిబ్బంది గాయపడ్డారో, ఎంత మందిని అరెస్టు చేశారో తెలియరాలేదు. సుమారు గంటపాటు జరిగిన ఈ గొడవలో గాయపడిన వారెవరికీ ప్రాణాపాయం లేదని ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లు తెలిపారు.

Read Also:Tamil Nadu: ఊర్లో నుంచి పారిపోయిన ప్రేమ జంట.. అబ్బాయి తల్లిని ఏం చేశారంటే..!

కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ మధ్యాహ్నం 1.20 గంటలకు ఆర్‌జి కర్ ఆసుపత్రికి చేరుకున్నారు. అదనపు బలగాలను కూడా రప్పించారు. పోలీసు కమీషనర్ ఈ దాడికి సోషల్ మీడియా, ఆన్‌లైన్ వార్తా సంస్థలను తప్పుపట్టారు. 31 ఏళ్ల డాక్టర్ హత్య గురించి చేసిన హానికరమైన ప్రచారమే దాడికి ఈ దారితీసిందని అన్నారు. పోలీసుల పరువు తీసేందుకు నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అనికేత్ మైతీ అనే జూనియర్ డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ, “దాడి జరగడానికి చాలా ముందే అల్లరి మూకలు ఆసుపత్రి వెలుపల గుమిగూడడం మేము చూశాము. వారిపై యాక్షన్ తీసుకోవాలని పోలీసులను అభ్యర్థించాము, కానీ వారు ఏమీ చేయలేదు. అల్లర్లు ప్రారంభమైనప్పుడు పోలీసులు ఆశ్రయం పొందేందుకు హాస్పిటల్ ఆవరణలో పరుగులు తీశారు” అని చెప్పుకొచ్చారు. మంగళవారం నాడు సిబిఐ విచారణకు ఆదేశిస్తూ, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ శివజ్ఞానం, జస్టిస్ హిరణ్మోయ్ భట్టాచార్య డివిజన్ బెంచ్ రోగుల ప్రయోజనాల కోసం తిరిగి విధుల్లోకి రావాలని ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లకు విజ్ఞప్తి చేసింది. బుధవారం సాయంత్రం జరిగిన టీఎంసీ కార్యక్రమంలో హోం, ఆరోగ్య శాఖల ఇన్‌చార్జి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇదే విధమైన విజ్ఞప్తి చేశారు.

Show comments