Site icon NTV Telugu

KKR vs PBKS: కోల్ కతా వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య పోరు.. ఓడితే ఇంటికే..

Kkr Vs Pbks

Kkr Vs Pbks

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు స్టార్ట్ కానుంది. అయితే ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా కోల్‌కతా టీమ్ ప్లేఆఫ్‌కు చేరుకోవాలనే ఆశను సజీవంగా ఉంచుకోవాలనుకుంటోంది. పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లను సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ 10 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ మ్యాచ్‌లో టాస్‌ కీలకంగా మారనుంది.

Also Read : Mallu Ravi : కేటీఆర్‌ క్షమాపణ చెప్పాలి..

అయితే పాయింట్ల పట్టికలో టాప్-4 జట్లను పరిశీలిస్తే.. గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ 13 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అదే సమయంలో లక్నో సూపర్ జెయింట్ 11 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇది కాకుండా పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ ఏడవ స్థానంలో, కోల్‌కతా నైట్ రైడర్స్ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించినప్పటికీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ 9వ స్థానంలో ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ 10వ స్థానానికి పరిమితం అయింది.

Also Read : Vijay Devarakonda: ‘మేమ్ ఫేమస్’… అందుకే ముందే వస్తున్నాం!

తుది జట్ల అంచనా :

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు : రహ్మానుల్లా గుర్బాజ్ (కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రానా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.

పంజాబ్ కింగ్స్ జట్టు : అథర్వ టైడ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, షారుఖ్ ఖాన్, జితేష్ శర్మ (కీపర్), సామ్ కర్రాన్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్.

Exit mobile version