NTV Telugu Site icon

IPL 2024 Winner: ఐపీఎల్ 2024 విజేత కోల్కతా నైట్ రైడర్స్..

Kkr Won

Kkr Won

ఐపీఎల్ 2024 విజేతగా కోల్కతా నైట్ రైడర్స్ అవతరించింది. ఫైనల్స్లో సన్ రైజర్స్ను ఓడించి 3వ సారి కప్ను సొంతం చేసుకుంది. 8 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా.. కేవలం 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. కోల్కతా బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ (52*) పరుగులతో రాణించాడు. గుర్బాజ్ (39), సునీల్ నరైన్ (6), శ్రేయాస్ అయ్యర్ (6*) పరుగులు చేశారు. దీంతో.. కోల్కతా సూపర్ విక్టరీ సాధించింది. సన్ రైజర్స్ బౌలింగ్లో కమిన్స్, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ తీశారు.

Read Also: Gangs of Godavari : విశ్వక్ సేన్ మూవీకి న్యూయార్క్ లో క్రేజ్ మాములుగా లేదుగా..

మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు విఫలమయ్యారు. 18.3 ఓవర్లలోనే కేవలం 113 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. సన్ రైజర్స్ బ్యాటింగ్లో మొదట నుంచి బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. మొదట్లోనే ట్రావిస్ హెడ్ డకౌట్ కాగా, అభిషేక్ శర్మ (2) వికెట్లు పోవడంతో జట్టు తీవ్ర కష్టాల్లో పడింది. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి (9), మార్క్రమ్ (20), నితీష్ కుమార్ రెడ్డి (13), క్లాసెన్ (16) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. తర్వాత షాబాజ్ అహ్మద్ (8), ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అబ్దుల్ సమద్ (4) పరుగులు చేశారు. చివర్లో కెప్టెన్ కమిన్స్ (24) పరుగులు చేయడంతో జట్టు 113 పరుగులు చేయగలిగింది. ఫైనల్లో కేకేఆర్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. కేకేఆర్ బౌలింగ్లో రస్సెల్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత స్టార్క్, హర్షిత్ రాణా తలో 2 వికెట్లు తీశారు. వైభవ్ అరోరా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ సంపాదించారు.