Kolkata Doctor Case: కోల్‌కతాలోని ఆర్‌జికర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో జరిగిన లేడీ డాక్టర్ రేప్-మర్డర్ కేసును నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. మమత ప్రభుత్వం హామీ ఇచ్చిన తమ డిమాండ్లను నెరవేర్చలేదని వారు ఆరోపించారు. శుక్రవారం ధర్మతలలోని డోరినా క్రాసింగ్ వద్ద వైద్యులు నిరసన చేపట్టారు. హామీ మేరకు తన డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి 24 గంటల గడువు విధించారు. ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న జూనియర్ డాక్టర్ మాట్లాడుతూ.. గడువులోగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, అందుకే మా డిమాండ్లు సాధించే వరకు ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నామని, పారదర్శకత కోసం నిరాహారదీక్ష జరిగే వేదికపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. మేము వాగ్దానం చేసినట్లుగా తిరిగి పని చేస్తామని తెలిపారు.
Also Read: IND vs BAN: నేడే భారత్-బంగ్లాదేశ్ తొలి టీ20
సెప్టెంబరు 17న జూనియర్ డాక్టర్లు, మమత ప్రభుత్వం మధ్య జరిగిన సమావేశంలో పలు డిమాండ్లను ఆమోదించారు. ఇందులో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ లను తొలగించారు. దీంతో పాటు కోల్‌కతా సీపీ వినీత్ గోయల్‌ను కూడా ఆయన పదవి నుంచి తప్పించారు. మమత ప్రభుత్వం నుంచి వైద్యులు 5 డిమాండ్లు చేయగా, వాటిలో మూడింటిని ప్రభుత్వం ఆమోదించింది. కొద్దిరోజుల తర్వాత వైద్యులు ఆందోళన విరమించారు. తాజాగా మళ్లీ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.
Also Read: Siva : 35 సంవత్సరాల ట్రెండ్ సెట్టర్ అక్కినేని నాగార్జున, RGV ల ‘శివ’