NTV Telugu Site icon

HMDA: కోట్లు కురిపించిన కోకాపేట భూములు.. ఎకరం రూ.100 కోట్లు

Kokapet

Kokapet

HMDA: కోకాపేటలోని నియో పోలిస్‌ ఫేస్‌-2లోని భూములు హెచ్‌ఎండీఏకు కోట్లు కురిపించాయి. రికార్డు స్థాయిలో హైదరాబాద్‌ చరిత్రలోనే అత్యధికంగా ఎకరానికి రూ.100 కోట్లు ధర పలికింది. నియో పోలిస్‌లో హెచ్‌ఎండీఏ ఎకరం భూమికి రూ.35 కోట్లుగా ధరను నిర్ణయించగా.. ఈ భూముల వేలంలో దిగ్గజ స్థిరాస్తి సంస్థలు పోటీపడ్డాయి. వేలంలో అత్యధికంగా ఎకరం భూమి ధర రూ. 100 కోట్లు.. అత్యల్పంగా రూ. 51.75 కోట్లు పలికింది. అయితే ఈరోజు ఉదయం తొలి విడతలో చేపట్టిన 6,7,8,9 ఫ్లాట్ల వేలం ముగియగా.. మొత్తంగా నాలుగు ప్లాట్ల వేలంలో హెచ్‌ఎండీఏకు రూ. 1,532.5 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. గురువారం ఉదయం 26.86 ఎకరాలకు వేలం పూర్తయింది.

Also Read: Wall Collapse: విషాదం.. ఇంటి గోడ కూలి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

సాయంత్రం నుంచి 10,11,14 నెంబరు ప్లాట్లకు వేలం నిర్వహించారు. 18.47 ఎకరాలకు వేలం నిర్వహించగా.. 10 వ నెంబరు ప్లాట్‌కు హైదరాబాద్‌ చరిత్రలోనే అత్యధిక ధర రూ.100 కోట్లు పలికింది. స్థిరాస్తి దిగ్గజ సంస్థల పోటీ చూస్తుంటే ప్రభుత్వం అంచనా వేసిన దానికంటే ఎక్కువ ఆదాయం సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్లాట్ల వేలం ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. షాపూర్‌జీ పల్లోంజీ, ఎన్‌సీసీ, మైహోం, రాజ్‌పుష్పా తదితర ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సంస్థలు కోకాపేట భూముల ఈ వేలంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. భవిష్యత్‌లో 10వ నెంబర్ ప్లాట్‌కు ఓఆర్‌ఆర్‌కు కనెక్టివిటీ వస్తుండడంతో ఇంత డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.

గతంలో 2021 జూలైలో నియోపోలిస్ ఫేజ్ 1 వేలంలో అత్యధికంగా ఎకరం ధర రూ. 60 కోట్లను తాకింది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,000 కోట్లు సంపాదించింది. ఫేజ్‌ 1లో దాదాపు 49 ఎకరాలు విక్రయించగా.. ఎకరం అప్‌సెట్ ధరను 25 కోట్లుగా నిర్ణయించారు. అయితే ఈరోజు జరిగే వేలం ద్వారా మరో రూ. 2,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

 

Show comments