Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, తానూ అడగలేదని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రభుత్వ పదవులు, నామినేటెడ్ పోస్టులు కావాలని అడుగుతున్నామన్నారు. తెలంగాణ జనసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్, ఎమ్మెల్సీ కోదండరాం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో నిర్భందాలు ఎదుర్కొన్నామన్నారు. ఎన్నో కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని చెప్పారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశామని, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఉద్యమ స్పూర్తితో ముందుకు పోయామన్నారు. ఎన్నికలు, పైసల విషయంలో వెనుకబడి ఉండొచ్చు.. కానీ తెలంగాణ ప్రజలకు నిరుద్యోగులకు, అండగా ఉండటంలో ముందు ఉన్నామన్నారు. ప్రజలే మనకు ప్రమాణం.. ఉద్యమ ఆకర్షణే స్పూర్తితో ముందుకు పోదామని పిలుపునిచ్చారు. మే12న పార్టీ ప్లీనరీ ఉంటుందని చెప్పారు. తెలంగాణలో మార్పు కోసం నైతిక శక్తిగా నిలబడదామన్నారు.
“చిన్న పార్టీ అని హేళన చేసిన ప్రజల పక్షాన నిలబడ్డాం. మనం చేసే పని నిజాయితిగా ఉండాలని పార్టీ పెట్టాం. ఎన్ని అటు పోట్లు అవహేళన చేసినా పార్టీ పెట్టి విజయవంతంగా పూర్తి చేసుకొన్నాం. నిరంకుశ పాలనను అంతమొందించాలని కాంగ్రెస్కు మద్దతు ఇచ్చాం. పైసలు ప్రధానం అయి పోతున్నాయి. రాజకీయాల్లో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. బెంగాల్లో విచ్చల విడిగా డబ్బులు పంచుతున్నారు. కేంద్రంలో SIRతో డబ్బులు కుమ్మరించి గెలవాలని చూస్తున్నారు.” అని కోదండరాం వ్యాఖ్యానించారు. ఇక గతం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. “గతంలో ఎవరినైనా కలవాలంటే భయపడే పరిస్థితి ఉండేది. ఎవరి దగ్గరకైనా వెళ్ళాలంటే.. ఇంట్లోనే ఫోన్ పెట్టి జాగ్రత్తగా రమ్మని చెప్పేవాళ్ళు. భయం అంటే ఏంటో గత ప్రభుత్వం చూపెట్టింది. అమరుల స్పూర్తి యాత్ర చేస్తామంటే కూడా గతంలో పర్మిషన్ ఇవ్వలేదు. ప్రజలకు దూరంగా ఉంటే ఏ పార్టీ బతకదు. కేసీఆర్ అందుకే బయటకి వస్తున్నారు. మేం సరిగ్గానే ఉన్నాం, ప్రజలే మారాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. కుటుంబ లోపాలను కవిత బయట పెడుతుంది. పార్టీ అంటే కుటుంబమే అని కవిత చెప్పకనే చెబుతోంది.” అని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!