Kodanda Reddy : రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో పర్యటించిన రైతు కమిషన్.. రైతులతో వ్యవసాయదారులతో కౌలు రైతులతో కలిసి అభిప్రాయ సేకరణ చేపట్టిందని, కూరగాయలు,పండ్లు పులతోటలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెరగాలన్నా, దిగుబడి రావాలన్నా రైతులకు సబ్సీడీ పథకాలు తేవాలన్నారు. అయితే గ్రౌండ్ వాటర్ పై ఆధారపడిన రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అదేవిదంగా చాలావరకు రైతులు ప్రకృతి వ్యవసాయానికి మొగ్గు చూపుతున్నారని గుర్తుచేశారు. దీనికి కూడా ప్రభుత్వం ఇంపార్టెంట్ ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ పథకం రాష్ట్రంలో అమల్లో ఉంది.
Health Benefits of Dates: ప్రతిరోజూ ఖర్జూరాలు తింటే.. ఈ వ్యాధులు రమ్మన్నా రావు!
వ్యవసాయ రంగానికి కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉద్యాన వన పంటలు సాగుచేసే రైతులకు ఉపాధి హామీ ని అనుసంధానం చేయాలన్నారు. ఇక పసుపు, కూరగాయలు, పూలతోటలు పండించే వారికీ యాంత్రీకరణ పద్ధతులు అవసరం ..అందులో చిన్న యంత్ర పరికరాలు ఇస్తే మంచిదని కమిషన్ కోరింది. రాష్ట్రంలో చిన్న కమతాలు ఎక్కువగా ఉండడం వల్ల వారికీ మరింత మేలు జరుగుతుందన్నారు. కోతుల బాధ నివారణకై ఏకైక మార్గం సోలార్ ఫెన్సింగ్ ఒక్కటే మార్గం. రైతులు దీనిని ఏర్పాటు చేసుకోడానికి ప్రభుత్వం సబ్సీడీ ఇస్తే హార్టికల్చర్ పంట ఉత్పతులు మరింత పెరుగుతాయన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. రైతు కమిషన్ ఇచ్చిన లేఖకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించినట్లు రైతు కమిషన్ తెలిపింది.
Virat Kohli: “ఓడినా పర్వాలేదు, కోహ్లీ సెంచరీ చేశాడు”.. ఇస్లామాబాద్‌లో ఫ్యాన్స్ సంబరాలు..