Site icon NTV Telugu

Kodanda Reddy: రైతులను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు..

Kodandareddy

Kodandareddy

వర్షాభావంతో రాష్ట్రంలో పంటలు అగమౌతున్నాయని జాతీయ కిసాన్ సెల్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి అన్నారు. ప్రధానంగా వర్షాధార పంటలు దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో దయనీయంగా వుంది.. కేసీఆర్ వరి, పత్తి పంటలు కాకుండా ఇతర పంటలు వేయమంటే వేశారు.. మేము వ్యవసాయ శాఖ, ఎండోమెంట్ శాఖతో మాట్లాడినం.. దేవాలయాల్లో పూజలు చెయ్యాలని కూడా చెప్పాము అని కోదండరెడ్డి తెలిపారు.

Read Also: Ram Gopal Varma: OG గ్లింప్స్ పై వర్మ షాకింగ్ రివ్యూ.. అస్సలు ఊహించలేదే

సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో మంత్రి కేటీఆర్ విదేశాల్లో ఉన్నారు అని కిసాన్ సెల్ జాతీయ వైఎస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నారో తెలీదు.. తెలుగు రాష్ట్రాల్లో సేమ్ సిచువేషన్ ఉంది.. ఏపీ సీఎం జగన్ వ్యవసాయ పరిస్థితులపై రివ్యూ చేశారు.. కానీ మన సీఎం కేసీఆర్ మాత్రం రివ్యూ చెయ్యలేదు.. ఏమన్నంటే కిసాన్ సర్కార్ అంటాడు.. అధిక వర్షాలు పడి పంటలు దెబ్బతిన్న కేసీఆర్ పట్టించుకోలేదు.. అధిక వర్షాల వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని కోరాం.. ఐనా పట్టించుకోలేదని కోదండరెడ్డి చెప్పారు.

Read Also: MLC Jeevan Reddy: కాంగ్రెస్ దళిత డిక్లరేషన్ పై మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శలు హాస్యాస్పదం

రైతులకు దెబ్బ మీద దెబ్బ పడింది.. కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామని కోదండరెడ్డి అన్నారు. రుణమాఫీతో సంబంధం లేకుండా మళ్లీ ఆదుకోవాలి.. కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వెంటనే తెలంగాణ రైతులను ఆదుకోవాలి.. లేకపోతే రైతులకు న్యాయం చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version