గన్నవరం విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ల కలకలం రేపింది. విజయవాడలోని కేయల్ యూనివర్సిటీ నుండి ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆర్య అనే విద్యార్థి వద్ద బుల్లెట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎయిర్‌పోర్ట్ ఎంట్రన్స్ వద్ద విద్యార్థి బ్యాగులో రెండు బుల్లెట్లను పోలీసులు గుర్తించారు. విద్యార్థి ఆర్య నుంచి బుల్లెట్లను స్వాధీనం చేసుకుని.. గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Also Read: MInister Atchannaidu: మిర్చి రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది!
గన్నవరం సీఐ బీవీ శివ ప్రసాద్ మాట్లాడుతూ… ‘కేయల్ యూనివర్సిటీలో ఆర్య అనే యువకుడు బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ఉదయం ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు. తనిఖీల్లో ఆర్య బ్యాగులో రెండు బుల్లెట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యువకుడిది హర్యానాలోని పానిపట్టు. ఆర్య తండ్రికి అనుమతులు ఉన్న రివాల్వర్‌లోని బుల్లెట్లు అని చెబుతున్నాడు. గత జులైలో హర్యానా నుండి వచ్చే సమయంలో తండ్రి బ్యాగును తానూ తెచుకున్నానని ఆర్య చెప్పాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’ అని తెలిపారు.