Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Kl Rahul To Miss Ind Vs Eng 5th Test With Injury

KL Rahul: లండన్‌కు కేఎల్‌ రాహుల్‌.. ఐదో టెస్టుకు కూడా దూరం!

Published Date :February 28, 2024 , 11:06 am
By Sampath Kumar
KL Rahul: లండన్‌కు కేఎల్‌ రాహుల్‌.. ఐదో టెస్టుకు కూడా దూరం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

KL Rahul in London due to Injury: ఇంగ్లండ్‌తో జరిగే ఐదవ టెస్టుకు కూడా టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్‌ రాహుల్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడమే ఇందుకు కారణం. రాహుల్‌ సమస్య ఏమిటో బీసీసీఐ వైద్య బృందానికి అంతుచిక్కపోవడంతో అతడిని లండన్‌కు పంపింది. అక్కడి వైద్య నిపుణుల వద్ద రాహుల్ చికిత్స పొందనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాయంపై మార్చి 2 నాటికి బీసీసీఐకి ఓ క్లారిటీ రానుందని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది.

ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన టెస్టులో కేఎల్ రాహుల్‌ గాయపడ్డాడు. తొడకండరాలు పట్టేడయడంతో రెండు, మూడు, నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. ఇన్ని రోజులు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందాడు. ధర్మశాల వేదికగా జరుగనున్న ఐదవ మ్యాచ్‌లోనైనా రాహుల్ మైదానంలో దిగుతాడని భావించగా.. గాయం మళ్లీ తిరగబెట్టినట్లు తెలుస్తోంది. రాహుల్‌ సమస్య ఏమిటో బీసీసీఐ వైద్య బృందానికి అంతుపట్టకపోవడంతో అతడిని లండన్‌కు పంపారు. అక్కడ స్కానింగ్ తీయనుండగా.. మరో రెండు రోజుల్లో అసలు సమస్య ఏంటో తెలియరానుంది.

Also Read: Kane Williamson: మూడోసారి తండ్రైన కేన్ మామ!

‘గత మూడు టెస్టులకు లోకేష్ రాహుల్‌ అందుబాటులో ఉంటాడనే అనుకున్నాం. అయితే తాను తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు రాహుల్‌ చెప్పాడు. ఇటీవల వికెట్‌ కీపింగ్‌ కారణంగా అతడిపై పనిభారం ఎక్కువైంది. రాహుల్ తొడ కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. అతడి తాజా మెడికల్‌ రిపోర్టును ఇంగ్లండ్‌లో గతంలో ట్రీట్‌మెంట్ ఇచ్చిన డాక్టర్‌కు పంపించారు. నేరుగా చెకప్‌ చేసిన తర్వాతే సమస్య ఏమిటో తెలుస్తుందని డాక్టర్ చెప్పారు’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-1తో గెలిచింది. మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా ఐదో టెస్టు ఆరంభం కానుంది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ind vs eng
  • KL Rahul
  • KL Rahul Injury
  • KL Rahul London
  • KL Rahul News

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions