Site icon NTV Telugu

KL Rahul Six: చూడ్డానికి సన్నగా ఉన్నా.. బంతి మాత్రం స్టేడియం బయట పడింది!

Kl Rahul Six

Kl Rahul Six

KL Rahul hits a six on the Indore stadium roof: గాయం కారణంగా కొంతకాలం జట్టుకు దూరమైన టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌.. ఆసియా కప్ 2023 ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆసియా కప్‌ సూపర్‌-4లో భాగంగా దయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ సెంచరీ చేశాడు. అదే ఫామ్ ఆస్ట్రేలియాపై కూడా కొనసాగిస్తున్నాడు. మొదటి వన్డేలో హాఫ్ సెంచరీ (58) చేసిన రాహుల్.. రెండో వన్డేలో మరో హాఫ్ సెంచరీ (52) బాదాడు. 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. అయితే రాహుల్ కొట్టిన ఓ భారీ సిక్సర్‌కు సంబదించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రెండో వన్డేలో క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే ఆసీస్ బౌలర్లపై లోకేష్ రాహుల్‌ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో పేసర్ కామెరాన్ గ్రీన్ బౌలింగ్‌లో రాహుల్‌ భారీ సిక్సర్ బాదాడు. 35 ఓవర్‌లోని మూడో బంతిని డిప్‌మిడ్‌ వికెట్‌ దిశగా భారీ సిక్సర్‌ బాదాడు. క్రీజులో నిలబడి సునాయాసంగా తన బలం మొత్తం ఉపయోగించి కొట్టాడు. రాహుల్‌ కొట్టిన బంతి 94 మీటర్లు వెళ్లి ఏకంగా స్టేడియం బయట పడింది. దాంతో గ్రీన్ షాక్ అయ్యాడు. రాహుల్ కొట్టిన ఈ సిక్సర్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలేట్‌గా నిలిచింది.

Also Read: David Warner Batting: రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసిన డేవిడ్‌ వార్నర్‌.. నవ్వుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్! చివరకు

లోకేష్ రాహుల్ కొట్టిన ఈ సిక్సర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ‘రాహుల్.. సూపర్ షాట్’, ‘క్లాసిక్ షాట్’, ‘సూడ్డానికి సన్నగా ఉన్నా.. బంతి మాత్రం స్టేడియం బయట పడింది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా సిరీస్‌లోని మొదటి రెండు వన్డేలకు రాహుల్ నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. మూడో వన్డేకు రోహిత్ శర్మ అందుబాటులోకి రావడంతో రాహుల్ కేవలం బ్యాటర్ గానే కొనసాగనున్నాడు.

Exit mobile version