KL Rahul: రాయ్‌పూర్‌లో బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ ఓడడానికి టాస్ కోల్పోవడమే మ్యాచ్ ఫలితంపై పెద్ద ప్రభావం చూపిందని టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ పేర్కొన్నారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 358/5 భారీ స్కోరు నమోదు చేసినప్పటికీ, దక్షిణాఫ్రికా ఆ లక్ష్యాన్ని 49.2 ఓవర్లలో ఛేదించి 4 వికెట్లతో ఘన విజయం సాధించింది.
Mahindra XEV 9S First Drive Review: దేశపు మొట్టమొదటి 7-సీటర్ EV.. ఫర్ఫామెన్స్ ఎలా ఉందంటే..?
మొదటగా బ్యాటింగ్ చేసిన భారత జట్టులో విరాట్ కోహ్లీ 93 బంతుల్లో 102 పరుహులు చేసి తన 53వ వన్డే శతకాన్ని సాధించగా.. ఇక మరో ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ 83 బంతుల్లో 105 పరుగులతో తన కెరీర్ తొలి వన్డే సెంచరీని నమోదుచేశారు. ఈ ఇద్దరి శతకాలతో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. ఇక మ్యాచ్ ఓటమి అనంతరం మాట్లాడిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్.. రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ ఎక్కువగా ఉన్న కారణంగా బౌలర్లకు ఇబ్బందిగా మారిందని అన్నారు. అలాగే ఈ ఓటమి అంత బాధగా అనిపించట్లేదు.. రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ కారణంగా బౌలింగ్ చాలా కష్టంగా మారింది, టాస్ మళ్లీ పెద్ద పాత్ర పోషించిందని అన్నారు. రెండోసారి కూడా నేను టాస్ ఓడిపోయాను.. అందుకే కొంచెం నన్నే తిట్టుకుంటున్నా (నవ్వుతూ) అని రాహుల్ వ్యాఖ్యానించారు.
Mohit Sharma: అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన టీమిండియా ప్లేయర్..!
భారీ స్కోరు చేసినప్పటికీ మరో 20–25 పరుగులు ఎక్కువ చేసి ఉంటే బౌలర్లకు మరింత ఉపయోగపడదని ఆయన అభిప్రాయపడ్డారు. నిజానికి 350+ మంచి స్కోరే కానీ.. ఆ తడిబంతితో బౌలర్లు కొంచెం బాగా ఉండేందుకు మరికొన్ని పరుగులు చేసి ఉంటే బాగుండేదని అన్నారు. ఇక ఆ తర్వాత రాహుల్, కోహ్లీ–రుతురాజ్ ఆటతీరును ప్రశంసించారు. రుతు బ్యాటింగ్ అద్భుతం. అర్ధసెంచరీ తర్వాత అతని ఆట వేగం పెంచిన తీరు చూడడానికి చాలా బాగుంది. కోహ్లీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన ఇది ఎన్నోసార్లు చేశారు అని రాహుల్ అన్నారు.
