NTV Telugu Site icon

Cricket For Charity: వేలంలో రూ.40 లక్షలు పలికిన విరాట్ కోహ్లీ జెర్సీ.. ధోనీ, రోహిత్ బ్యాట్‌లు ఎంత రేట్ పలికాయంటే..?

Kohli

Kohli

Cricket For Charity: ” క్రికెట్ ఫర్ చారిటీ ” వేలాన్ని తాజాగా భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, అతని భార్య అతియా శెట్టి నిర్వహించారు. వేలం ఉద్దేశం నిరుపేద పిల్లలకు విద్యను అందించడానికి కృషి చేస్తున్న ఓ సంస్థకు సహాయం చేయడమే. ఈ వేలంలో టీమిండియా తరఫునుండి చాలామంది క్రికెటర్లు వారి వ్యక్తిగత వస్తువులను వేలానికి అందించారు. ఇందులో విరాట్ కోహ్లీ ధరించిన జెర్సీ, ఆయన బ్యాటింగ్ సమయంలో వాడిన బ్యాటింగ్ గ్లోవ్స్ ఇంకా, రోహిత్ శర్మ బ్యాట్, మహేందర్ సింగ్ బ్యాట్, రాహుల్ ద్రావిడ్ బ్యాట్ ఇలా అనేక వస్తువులకు వేలంపాట నిర్వహించారు. ఇక ఈ వేలంలో ఏ వస్తువు ఎందుకు అమ్ముడుపోయిందో ఓసారి చూస్తే..

ఈ వేలంలో అత్యధికంగా ధరించిన జెర్సీ ఏకంగా 40 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. ఆ తర్వాత కోహ్లీ బ్యాటింగ్ సమయంలో వినియోగించిన గ్లోవ్స్ 28 లక్షలు పలికాయి. ఇక ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ ను క్రికెట్ ఫర్ చారిటీ వేలంలో 24 లక్షల రూపాయలు పలికింది. మహేంద్ర సింగ్ ధోని బ్యాట్ కు 13 లక్షల రూపాయలు, టీమిండియా మాజీ ఆటగాడు & కోచ్ రాహుల్ ద్రావిడ్ బ్యాట్ కు 11 లక్షల రూపాయలు, అలాగే కేఎల్ రాహుల్ ధరించిన జెర్సీ కి 11 లక్షల రూపాయలు వచ్చాయి.

కేఎల్ రాహుల్ అతడి భార్య అతియా శెట్టి మొదలుపెట్టిన ఈ ప్రచారంలో టీమిండియా ఆటగాళ్లు రిషబ్ పంత్, సంజు శాంసన్, జస్ప్రిత్ బూమ్రాలు కూడా భాగస్వాములు అయ్యారు. వీరితోపాటు అంతర్జాతీయ ఆటగాళ్లు నికోలస్ పురన్, జోష్ బట్లర్, క్వింటన్ డికాక్ లాంటి ఆటగాళ్లు సహకారం కూడా ఈ ప్రచారంలో భాగస్వాములయ్యారు. ఇకపోతే., ఈ చారిటీ వేళల్లో మొత్తంగా రూ. 1.93 కోట్ల రూపాయల మొత్తం నిధులు సమకూరినట్లు సమాచారం. ఈ విషయాన్ని తాజాగా ఇంస్టాగ్రామ్ లో తన కథనాన్ని పోస్ట్ చేశాడు కేఎల్ రాహుల్. తాము నిర్వహించిన వేలం విజయవంతం అయిందని ఈ డబ్బు మొత్తం నిరుపేద పిల్లలు చదువు కోసం వినియోగిస్తానని ఆయన చెప్పుకొచ్చాడు. ఇంతటి మంచి పని చేసిన కేఎల్ రాహుల్ దంపతులకు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Show comments