Site icon NTV Telugu

KKR vs RR: ఈడెన్ గార్డెన్స్‌ లో కోల్‌కతా నైట్ రైడర్స్ ను రాజస్థాన్ ఓడించగలదా..?!

1

1

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో 31వ మ్యాచ్‌ లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ని కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ లో ఏప్రిల్ 16 మంగళవారం నాడు రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం వీరిద్దరూ టేబుల్ టాపర్‌ ల మధ్య మ్యాచ్ కావడంతో హై వోల్టేజ్ మ్యాచ్ కానుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు ఖచ్చితంగా.. ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంటారు.

Also Read: SRH vs RCB: సన్ రైజర్స్ విక్టరీ.. 25 రన్స్ తేడాతో గెలుపు

ఇక కోల్‌కతా, రాజస్థాన్‌ లు 28 మ్యాచ్‌ల్లో ఇప్పటి వరకు ఐపీఎల్ లో తలపడ్డాయి. ఇందులో నైట్ రైడర్స్ 14 గెలిచి, రాయల్స్ 13 గెలుచుకోవడంతో నెక్ టు నెక్ ఫైట్ నడుస్తోంది. ఇక ఒక మ్యాచ్ లో రిజల్ట్ ఉంది. ఇక కోల్‌కతాలో ఈ రెండు టీమ్స్ 10 సార్లు తలపడగా ఇందులో రాజస్థాన్ రాయల్స్ 3 , కోల్‌కతా నైట్ రైడర్స్ 6 సార్లు గెలిచి నైట్ రైడర్స్ ముందంజలో ఉంది . ఇక్కడ ఒక మ్యాచ్ లో రెసుల్త్ రాలేదు. ఇక ఇరుజట్లు ప్లేయింగ్ XII ఆటగాళ్లను ఒకసారి పరిశీలిస్తే..

Also Read: Tiger: కాగజ్‌నగర్‌లో పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు

కోల్‌కతా నైట్ రైడర్స్ టీంలో ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ/నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్ , ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ వైబ్ ఎ, రావ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి లు ఉండవచ్చు.

ఇక మరోవైపు రాజస్థాన్ రాయల్స్ లో యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్ & wk), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధృవ్ జురెల్, రోవ్‌మన్ పావెల్/కేశవ్ మహరాజ్, రవిచంద్ర అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, కుల్దీప్ సేన్ , యుజ్వేంద్ర చాహల్లు ఉండవచ్చు.

Exit mobile version