NTV Telugu Site icon

Kiwi Health Benefits : కివీలను రోజూ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే వదలరు..

Kiwi

Kiwi

కివీ పండ్ల గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ, పొటాషియం, ఫోలేట్ అధిక మొత్తంలో ఉంటాయి. కివీస్ డైటరీ ఫైబర్‌ను కూడా అందిస్తుంది. జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల కలిగే లాభలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కివీస్‌లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ప్రేగు క్రమబద్ధతకు సపోర్టు ఇస్తుంది.. హృదయం ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.. పొటాషియం పుష్కలంగా ఉంటుంది. రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సాయపడుతుంది..

వీటిలో విటమిన్ కె, కాల్షియం, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి సహాయ పడుతుంది.. మెదుడు పనితీరును, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అలాగే.. రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. ఆరోగ్యకరమైన చర్మం, బలమైన కణజాలాలకు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.. వివిధ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడి నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి.. ఒక్కమాటలో చెప్పాలంటే కివీ పోషకాల నిధి.. డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Show comments