NTV Telugu Site icon

Viral Video : ఏంది సామి అరాచకం..ఇది చూస్తే జన్మలో దోసెలు తినరు..

Dosa

Dosa

ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుడ్ కు సంబందించిన రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.. వెరైటీ పేరుతో వింత కాంబినేషన్స్ తో వంటలను చేస్తున్నారు.. అందులో కొన్ని వీడియోలు అందరిని ఆకట్టుకోవడంతో ప్రశంసలు అందుకుంటున్నాయి.. మరికొన్ని వీడియోలు మాత్రం నెటిజన్ల ఆగ్రహానికి గురవుతూ ఉంటాయి.. పొద్దున్నే లేవగానే దోస, ఇడ్లీ ఏదోకటి చేసుకొని తినాలని అనుకుంటారు.. అందులో ఎక్కువ మంది దోసను తింటారు.. దోసలో కూడా రకరకాల దోసెలు అందుబాటులో ఉన్నాయి..

ఇక వ్యాపారులు కూడా రకరకాల దోసలను వేస్తారు.. ఎగ్ దోస, మసాలా దోస, అనియన్ దోస, ఉప్మా దోస ఇలా రకరకాల వంటకాలు మార్కెట్లో ఆహారప్రియులను ఊరిస్తూ ఉంటాయి.. సాధారణంగా ఇష్టమైన వెజిటబుల్స్‌ని సెలక్ట్ చేసుకుని దోశపై వేసి వాటిపై మసాలాలను వేసుకొని దోసెలు వేస్తారు.. అయితే కిట్ క్యాట్ దోస.. ఎలా ఉంటే అదే వెజిటబుల్ బదులు రే చాక్లెట్ బార్ ను దోస పై పెట్టి వేస్తారు.. పైన తియ్యగా చాక్లేట్ సాస్ ను కూడా వేస్తారు.. అదో వెరైటీ గా ఉందని జనాలు తినడానికి ఎగబడుతున్నారు..

కిట్ క్యాట్ దోస అంటే.. మాములుగా పెనం పై ముందుగా దోస వేసి.. దానికి కారం, మసాలాకు బదులుగా చాక్లేట్ సాస్, అలాగే పైన కిట్ క్యాట్ బార్ లను ఉంచి, దోసను చుట్టి ముక్కలుగా చేస్తారు.. దానిపైన పనీర్ తురుము, అలాగే చాక్లెట్ సాస్ వేసి సర్వ్ చేస్తారు.. ఇందుకు సంబందించిన వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఇలా ఎందుకు రా జనాలను చంపేస్తారు అంటూ కామెంట్ల అంటూ వరుస కామెంట్స్ తో వీడియోను మరింత ట్రెండ్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.. ఒక లుక్ వేసుకోండి..