Site icon NTV Telugu

Kishan Reddy: మోడీ మళ్లీ ప్రధాని అయితేనే దేశం బాగుంటుంది

Reddy

Reddy

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సమర్థ నాయకుడికి ఓటు వేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) ప్రజలకు పిలుపునిచ్చారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లా మందమర్రిలో కిషన్‌రెడ్డి ప్రసంగించారు.

‘‘ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. సమర్థ నాయకుడికి ఓటు వేయాలి. విజయ సంకల్ప యాత్రతో జనాల్లోకి వచ్చాం. ఎవరూ ప్రధాని అయితే దేశానికి బాగుటుందో.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. సమర్థ నాయకుడైన నరేంద్ర మోడీ మనకు ప్రధాని కావాలి. దేశంలో మహిళల అందరికీ టాయిలెట్‌లను ఉండాలన్న లక్ష్యంతో 13 కోట్ల టాయిలెట్‌లను నిర్మించారు.’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.

కేసీఆర్‌పై విమర్శలు..
‘‘కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్‌లతో ప్రజలను మోసం చేశారు. అహా నా పెళ్ళి అంటా సినిమాలా.. ప్రజలను కేసీఆర్ మోసం చేశారు. బాత్రూమ్‌లను బుల్లెట్ ప్రూప్‌తో కట్టించుకున్నారు. మోడీ పేదల కోసం టాయిలెట్‌లను నిర్మించారు. పేద వాళ్ళ కోసం వంట గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు. పేదవారు ఆరోగ్యం కోసం బీమా సౌకర్యం కల్పించారు. అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చారు. మహిళా సంఘాలకు రూ.20 లక్షల రుణాలు ఇవ్వాలని మోడీ నిర్ణయించారు. కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందించారు. జాతీయ రహదారులను విస్తరించారు. గతంలో ఉగ్రవాదుల దాడులు, మత కల్లోలాలు ఉండేవి. మోడీ వచ్చిన తర్వాత వాటిని నియంత్రించారు.’’ అని పేర్కొన్నారు.

పాకిస్థాన్‌ను నియంత్రించారు..
దాడులతో పాకిస్థాన్‌ను నియంత్రించారు. అమెరికా అధ్యక్షుడు మన ప్రధాని ముందు చేతులు కట్టుకుని నిలబడుతున్నారు. ప్రపంచ దేశాల అధినేతల మధ్యలో మన ప్రధాని కనబడుతున్నారు. ప్రధాన సేవకుడిగా సెలువు తీసుకోకుండా మోడీ నిరంతరం పని చేస్తు్న్నారు. కేసీఆర్ ఒక్క రోజు కూడా సచివాలయానికి రాలేదు. కాంగ్రెస్ వాళ్లు దేశాన్ని దోచుకున్నారు. కాంగ్రెస్ దోపిడీకి ప్రతిరూపం. మాఫీయాలా మారి బీఆర్ఎస్ పార్టీ దోచుకుంది. సకల రోగాలకు కాంగ్రెస్ పార్టీనే కారణం. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలే. రెండు పార్టీలు దోచుకున్న పార్టీలే.’’ అని ధ్వజమెత్తారు.

డబ్బులు తరలింపు..
‘‘తెలంగాణ నుంచి ఢిల్లీకి కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు తరలిస్తుంది. అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి మోడీ తన సత్తాను చాటుకున్నారు. మోడీ పాలనలో దేశం సుభిక్షంగా.. శాంతియుతంగా ఉంది. ముస్లిం మహిళలకు సమస్యగా ఉన్న తలాక్‌ను మోడీ రద్దు చేశారు.’’ అని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు.

Exit mobile version