Site icon NTV Telugu

Kishan Reddy: సీఎం రేవంత్ “పాకిస్థాన్” వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్..

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పాకిస్థాన్‌లో పేలని బాంబులు, జూబ్లీ హిల్స్‌లో పేలుతాయని రేవంత్ అవమానకరంగా మాట్లాడారన్నారు. మీ మీద కార్పెట్ బాంబు దాడులు జరుగుతాయన్నారు. ఇచ్చిన హామీలు నేరవేర్చనప్పుడు మా కార్పెట్ బాంబులు దాడులు ఉంటాయని తెలిపారు. మీ అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మా కార్పెట్ బాంబులు పేలుతూనే ఉంటాయని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో రోడ్లు లేవు, మొత్తం గుంతలే.. పరిశుభ్రత లేదు, రోడ్ల పైన దుర్గంధం వస్తుందని చెప్పారు. దీనికి బాధ్యత కాంగ్రెస్ , బీఆర్ఎస్‌లదే అన్నారు.

READ MORE: Ravi Kishan: బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు బెదిరింపులు.. భయపడేదిలేదన్న నటుడు

తెలంగాణ ప్రజలను ఈ రెండు పార్టీలు వెన్నుపోటు పొడిచాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. “ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియదు.. కాంగ్రెస్ అధికారంలో ఉంటే BRS ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి పోతారు.. BRS అధికారంలో ఉంటే కాంగ్రెస్ ఎమ్మేల్యేలు చేరుతారు.. ఈ రెండు పార్టీలకు ఓటు వేస్తే మజ్లిస్ కు ఓటు వేసినట్టే.. రేవంత్ రెడ్డి దిగజారుడుగా మాట్లాడారు.. భారత్ సైనికుల పట్ల అవమాన కరంగా మాట్లాడారు.. ముఖ్యమంత్రి స్థాయికి తగదు.. రేవంత్ రెడ్డి పాకిస్థాన్ వెళ్లి చూడు అక్కడి ప్రధాని తో కలిసి పరిశీలించు.. పాకిస్థాన్ ఒప్పుకుంది, అమెరికా చెబుతుంది..మేము సాక్ష్యాలు బయట పెట్టాం” అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.

READ MORE: Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ హెల్త్ అప్డెట్.. మెడికల్ రిపోర్టు విడుదల చేసిన BCCI..

Exit mobile version